బెయిల్ పై వచ్చి పెళ్లి చేసుకున్న హీరో!

Out on bail, Mithun Chakraborty's son Mahaakshay gets married to madalasa sharma
Highlights

ఈ క్రమంలో మహాక్షాయ్ వివాహం జరగాల్సిన రోజే పోలీసులు విచారణకు వెళ్లడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయితే నేడు వారి పెళ్లి ఊటీలో జరిగింది. మిథున్ చక్రవర్తికి చెందిన ఒక హోటల్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య మహాక్షాయ్.. మదాలస శర్మను వివాహం చేసుకున్నారు

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షాయ్ ఒక యువతిని మోసం చేసిన ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 7న నటి మదాలస శర్మతో జరగాల్సిన మహాక్షాయ్ వివాహం ఈ విషయం కారణంగా ఆగిపోయింది.

భోజ్ పూరికి చెందిన ఒక నటి మహాక్షాయ్ తనను మోసం చేశాడని, అతడి కారణంగా గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మహాక్షాయ్ తల్లి యోగితా బాలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మహాక్షాయ్ వివాహం జరగాల్సిన రోజే పోలీసులు విచారణకు వెళ్లడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

అయితే నేడు వారి పెళ్లి ఊటీలో జరిగింది. మిథున్ చక్రవర్తికి చెందిన ఒక హోటల్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య మహాక్షాయ్.. మదాలస శర్మను వివాహం చేసుకున్నారు. సోమవారం సంగీత్ ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నారని సమాచారం.  

loader