కన్నడ స్టార్ హీరో యష్ నటించిన తాజా చిత్రం 'కెజిఎఫ్'(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేశారు. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. హిందీలో 'జీరో' సినిమాతో పోటీ పడిన ఈ సినిమా తెలుగులో 'పడి పడి లేచే మనసు', 'అంతరిక్షం' వంటి సినిమాలతో పోటీ పడింది.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడానికి ముఖ్య కారణం.. వరల్డ్ సినిమాతో పోటీ పడడానికేనని అంటున్నాడు హీరో యష్. ఈ సినిమాతో వారు అనుకున్నది సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సినిమాతో తను పోషించిన రాకీ పాత్ర గురించి వెల్లడించిన యష్.. సినిమా స్టోరీ లైన్ కమర్షియల్ అంశాలతో నిండి ఉంటుందని అన్నారు.

యాక్షన్, స్టైల్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇలా ప్రతి అంశం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అన్నారు. కేవలం ఒక్క సినిమా తీసిన ప్రశాంత్ నీల్ తో ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఎలా ఓకే చెప్పారనే ప్రశ్న ఎదురుకాగా.. యష్ స్పందిస్తూ.. ''ప్రశాంత్ రూపొందించిన ఉగ్రం సినిమా నేను చూశాను. అతడి పనితనం నాకు ఎంతగానో నచ్చింది. 
అప్పుడే అతడితో సినిమా చేయాలనుకున్నాను.

ప్రశాంత్ కూడా నాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. కన్నడ ఇండస్ట్రీ స్టామినాని తెలియజేసే సినిమా చేయాలనుకున్నాం. ఆ తరువాత అన్నీ ఒకదాని తరువాత సెట్ అయ్యాయని'' చెప్పాడు.

ఇక రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. తనకు రీమేక్ ల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదని అన్నాడు. ఒరిజినల్ కంటెంట్ ఇతర భాషలకు వెళ్లినప్పుడు సోల్ మిస్ అవుతుందని, అక్కడి ప్రేక్షకులకు తగ్గట్లుగా కథ మార్చే సమయంలో క్రియేటివిటీలో తేడాలు రావడంతో ఎమోషనల్ గా రీమేక్ కథలు వర్కవుట్ కావడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే అన్ని సార్లు అలా జరగదని అన్నాడు.

పోటీ వాతావరణంలో సినిమా విడుదల చేయడానికి గల కారణాల గురించి చెబుతూ.. ఎక్కువగా సినిమాలు డిసంబర్ లో విడుదలవుతుంటాయని.. అలా విడుదలైన చాలా సినిమాలు విజయాలు అందుకుంటున్నాయని అదే ఉద్దేశంతో తన సినిమాని కూడా విడుదల చేసినట్లు స్పష్టం చేశాడు యష్.

కెజిఎఫ్ చాప్టర్ 1 గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే కెజిఎఫ్ చాప్టర్ 2 ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

'కెజిఎఫ్' మూవీ రివ్యూ!