Asianet News TeluguAsianet News Telugu

'కెజిఎఫ్' మూవీ రివ్యూ!

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కెజిఎఫ్'. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.

kgf movie telugu review
Author
Hyderabad, First Published Dec 21, 2018, 4:30 PM IST

నటీనటులు: యష్, శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్ తదితరులు 
సంగీతం: రవి బశ్రూర్, తనిష్క్ బాగిచ్ 
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ 
ఎడిటింగ్: శ్రీకాంత్ 
నిర్మాత: విజయ్ కిర్గందూర్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్ 

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కెజిఎఫ్'. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
సూర్యవర్ధన్(బిఎస్ అవినాష్) కి ఓ రాయి దొరుకుతుంది. అది బంగారం అని తెలుసుకున్న అతడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం నుండి లీజుకి తీసుకొని బంగారాన్ని తవ్విస్తుంటాడు. దానికోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బానిసలుగా మారుస్తాడు. అతడి చుట్టూ ఉన్న బలగం కారణంగా ఎవరూ ఎదిరించలేని పరిస్థితి. బంగారు గనులున్న ప్రాంతానికి 
పటిష్టమైన కాపలా పెడతాడు.

ఇది ఇలా ఉండగా.. సడెన్ గా సూర్యవర్ధన్ కి పక్షవాతం వస్తుంది. దీంతో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కెజిఎఫ్) మొత్తం అతడి కొడుకు గరుడ(రామచంద్రరాజు) కంట్రోల్ లోకి వస్తుంది. గరుడని చంపి ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు. ఈ నేపధ్యంలో ముంబైలో పేరు మోసిన రౌడీ రాకీ(యష్)ని రంగంలోకి దింపుతారు. గరుడని చంపడానికి డీల్ కుదుర్చుకున్న రాకీ కెజిఎఫ్ ప్రాంతానికి వెళ్లి అతడిని మట్టుబెట్టాలని అనుకుంటాడు.

ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి..? గరుడని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? బానిసలుగా బతుకుతున్న వారి బతుకుల్లో రాకీ కారణంగా ఎలాంటి మార్పులు వచ్చాయి..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
1970 లలో కోలార్ బంగారు గనుల్లో పని చేసే కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాను రెండు చాప్టర్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చాప్టర్ 1 పేరుతో విడుదలైన ఈ సినిమాలో హీరో ఓ డాన్ గా ఎదిగిన క్రమాన్ని, కెజిఎఫ్ అధినేతను చంపడానికి వచ్చి అక్కడ బానిసలుగా 
బతుకుతున జనాల మానసిక పరిస్థితి గమనించి ఎదురుతిరిగి వారికి దేవుడిగా మారడం ఒకటైతే.. అక్కడున్న వారిని తన సైన్యంగా మార్చుకొని ఏం చేశాడనే దాన్ని రెండో భాగంలో చూపించబోతున్నారు.

సినిమా ఆరంభం నుండి ఇంటర్వెల్ పూర్తయ్యే వరకు దర్శకుడు కథలోకి వెళ్లలేదు. హీరో తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని, ఆ తరువాత కొన్నేళ్ళకు తల్లిని పోగొట్టుకోవడం, బతకడం కోసం ముంబైకి వెళ్లి అక్కడ డాన్ గా ఎదగడం వంటి సన్నివేశాలతో సాగదీశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరో ఎలివేషన్ సీన్స్ మీద కథను నడిపించేశారు. భారీ ఫైట్, ఐటెం సాంగ్, హీరో ఎలివేషన్ సీన్స్ ఇలా గడిచిపోతున్న సినిమా.. సెకండ్ హాఫ్ లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

భారీ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కన్నడ హీరో యష్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. హీరో ఇంట్రడక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ ఆకట్టుకున్నాయి. అయితే యష్ లాంటి హీరోని పెట్టుకొని దర్శకుడు ఇంకా బెటర్ అవుట్ పుట్ఇవ్వొచ్చు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హీరోయిన్ శ్రీనిధి తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. తమన్నా ఐటెం సాంగ్ అదనపు ఆకర్షణ. విలన్ పాత్రల్లో కనిపించిన వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు ప్రశాంత్ కథ మీద కథ హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు.

బిల్డప్ షాట్స్ సంగతి పక్కన పెట్టి కథాకథనాలపై దృష్టి పెట్టి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో.. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కెజిఎస్ సెట్స్ అధ్బుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ వర్క్ కొత్త లుక్ ని తీసుకొచ్చింది. సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ఏ ఒక్క పాట గుర్తుండేలా లేవు. నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు మాత్రం భారీగా ఉన్నాయి. రెగ్యులర్ సినిమాలు చూసే ఆడియన్స్ ని పక్కన పెడితే హీరో యష్ అభిమానులను ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది.  

రేటింగ్: 2.5/5

Follow Us:
Download App:
  • android
  • ios