Asianet News TeluguAsianet News Telugu

2018 ఆస్కార్ ఫైనల్ విన్నర్స్ వీళ్లే

  •  కాలిఫోర్నియా లోని డాల్బీ థియేటర్ లో అత్యంత వైభవంగా ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
  • ఉత్తమ దర్శకునిగా గిలెర్మో డెల్ టోరో అవార్డు స్వీకరించాడు.
  • ఉత్తమ సహాయ నటి అవార్డు అల్లిసన్ జన్నె (ఐ టోన్యా) కి లభించింది. ​
oscar awards winners 2018

ప్రతిష్టాత్మక 90 వ ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఉత్తమ చిత్రంగా ” ది షేప్ ఆఫ్ వాటర్ ” అవార్డు దక్కించుకుంది. పైగా ఉత్తమ దర్శకత్వంతో బాటు మరో రెండు అవార్డులను కూడా ఈ చిత్రం కైవసం చేసుకుంది.

oscar awards winners 2018

ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకునిగా గిలెర్మో డెల్ టోరో అవార్డు స్వీకరించాడు. డార్కెస్ట్ అవర్ సినిమాకు గాను గ్యారీ ఓల్డ్ మన్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా.. త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరీ చిత్రానికి గాను ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇదే చిత్రంలో నటించిన సామ్ రాక్ వెల్ ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నాడు.

oscar awards winners 2018

 

.ఉత్తమ సహాయ నటి అవార్డు అల్లిసన్ జన్నె (ఐ టోన్యా) కి లభించింది. కాలిఫోర్నియా లోని డాల్బీ థియేటర్ లో అత్యంత వైభవంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. జిమీ కిమ్మెల్ రెండో సారి ఈ ఈవెంట్ కు హోస్టుగా వ్యవహరించాడు. ఆస్కార్ అవార్డులు పొందిన ఇతరాల వివరాలు ఇలా ఉన్నాయి.

oscar awards winners 2018

 

ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) – డియర్ బాస్కెట్‌బాల్
ఉత్తమ చిత్రం (యానిమేటెడ్) – కోకో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్లేడ్ రన్నర్ 2049
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – లీ స్మిత్ (డన్‌కిర్క్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – రిమెంబర్ మి: కోకో (సంగీతం: క్రిస్టెన్ అండెర్సన్, రచన: రాబర్ట్ లోపెజ్)
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) – హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
ఉత్తమ లఘుచిత్రం (లైవ్ యాక్షన్) – ది సైలెంట్ చైల్డ్

 

oscar awards winners 2018


ఉత్తమ విదేశీ చిత్రం – ఎ ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జోర్డాన్ పీలే (గెట్ ఔట్)
ఉత్తమ ఛాయాగ్రహణం – రోజర్ ఎ. డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్ – డార్కెస్ట్ అవర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)
ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) – ఐకారస్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – డన్‌కిర్క్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – డన్‌కిర్క్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ది షేప్ ఆఫ్ వాటర్
  

Follow Us:
Download App:
  • android
  • ios