MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తప్పేం లేదు.. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే: కృష్ణవంశీ

ప్రభాస్ తప్పేం లేదు.. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే: కృష్ణవంశీ

Krishna Vamsi: దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల సినిమా విజయాలు, అపజయాలపై తన దృక్పథాన్ని వెల్లడించారు. సినిమా ఫలితాలు కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉండవని, హిట్ అయితే హీరోలు, నిర్మాతలు.. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 25 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 సినిమా జయాపజయాలపై..
Image Credit : Krishna Vamsi\Twitter

సినిమా జయాపజయాలపై..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరొందిన కృష్ణవంశీ.. సినిమా జయాపజయాలపై తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఫలితం విషయంలో దర్శకుడి పాత్ర ఎంత కీలకమో, అదే సమయంలో క్రెడిట్ పంపకాలలో జరిగే వ్యత్యాసాలను కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమా హిట్ అవ్వగానే
Image Credit : Krishna Vamsi\Twitter

సినిమా హిట్ అవ్వగానే

ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆ విజయం తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడానికి ఆరాటపడతారని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్, రచయిత ఇలా అందరూ కూడా సినిమా హిట్ అవ్వగానే తమ వల్లే అయిందని సక్సెస్ క్రెడిట్‌ను పంచుకుంటారన్నారు. కానీ, అదే సినిమా పరాజయం పాలైతే మాత్రం, అందరి వేళ్లు దర్శకుడి వైపే చూపిస్తాయని వాపోయారు.

Related Articles

Related image1
Actress Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నటి హేమ, పెళ్లి ఎప్పుడంటే
Related image2
Telugu Cinema News Live: సీన్‌ సీన్‌కు ఉత్కంఠ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు, ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్
35
'చక్రం' అపజయంపై..
Image Credit : Krishna Vamsi\Twitter

'చక్రం' అపజయంపై..

తన కెరీర్‌లోని సినిమాల విషయానికొస్తే.. హిట్ అండ్ ప్లాఫ్ ఏదైనా కూడా బాధ్యత తనదేనని కృష్ణవంశీ అన్నారు. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన 'చక్రం' సినిమా ఆశించిన విజయం సాధించకపోవడానికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. హీరో బాధ్యత కూడా ఉందని చెప్పడం తప్పని.. ప్రభాస్ కేవలం నా ఆదేశాలను పాటించాడని.. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి కారణం నేనే అని ఆయన స్పష్టం చేశారు.

45
థియేటర్లలో ఆడకపోయినా..
Image Credit : Krishna Vamsi\Twitter

థియేటర్లలో ఆడకపోయినా..

థియేటర్లలో ఆడకపోయినా.. టీవీలు, ఓటీటీలలో 'చక్రం' చిత్రం కల్ట్ క్లాసిక్‌గా మారడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. థియేటర్లలో చూసేటప్పుడు ఉండే అంచనాలు, ఇంట్లో చూసేటప్పుడు ఉండే దృక్పథం వేర్వేరుగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. అందుకే చక్రం సినిమాను చెత్త సినిమా అనలేమని, అలా అంటే ప్రేక్షకులు ఒప్పుకోరని పేర్కొన్నారు.

55
హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు
Image Credit : Krishna Vamsi\Twitter

హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు

చివరగా, "హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు, ప్రజలకు నచ్చిన సినిమా వేరు.. ప్రజలకు నచ్చిన సినిమానే థియేటర్లలో సూపర్ హిట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా మేకింగ్‌లోని కష్టనష్టాలను, దర్శకుడిపై ఉండే ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Related Stories
Recommended image1
Actress Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నటి హేమ, పెళ్లి ఎప్పుడంటే
Recommended image2
Telugu Cinema News Live: సీన్‌ సీన్‌కు ఉత్కంఠ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు, ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved