ఈ రోమాంటిక్ పిల్ల మళ్లీ వచ్చింది

Oru Adaar Love Song Teaser
Highlights

ఈ రోమాంటిక్ పిల్ల మళ్లీ వచ్చింది

ప్రియా వరియర్.. కొన్నాళ్లుగా యూట్యూబ్ లో వినిపిస్తున్న క్రేజీ బ్యూటీ పేరు. కన్నుగీటి కుర్రాళ్ల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు కనుల తుపాకితో యువత మనసులను దోచేస్తుంది. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రియా ప్రకాశ్ వరియర్ తన చూపులతో బాలీవుడ్ స్టార్ రిషి కపూర్ ను సైతం బుట్టలో వేసుకుంది.

ఇక మన స్టైలిష్ స్టార్ కూడా ప్రియా చూపులకు ఇంప్రెస్ అయ్యాడు. ఒరు ఆదార్ లవ్ టీజర్ తోనే ఈ రేంజ్ సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన మరో టీజర్ తో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ప్రియ ప్రకాశ్. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరి హాయ్ అంటూ ఎప్పుడో రవితేజ పాట వచ్చింది.

ప్రియా కనుసైగలను చూస్తే యువత అంతా ఆ పాటని వినక తప్పదు. సినిమా ఎలా ఉంటుందో ఏమో కాని ప్రియాని వాడుకుని మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ పొందుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రియా క్రేజ్ ను చూసి ఒరు ఆదార్ లవ్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

                        

loader