'సై రా' టీజర్: ఒక్క డైలాగ్ మాత్రమే..

First Published 20, Aug 2018, 12:22 PM IST
only one dialogue in sye ra narasimhereddy teaser
Highlights

టీజర్ మొత్తం బ్రిటీష్ జనాలు, ఒక కోట ఇలా సాగుతూ చివరగా ఉయ్యాలవాడ గెటప్ లో చిరు లుక్ ని రివీల్ చేస్తూ ఓ డైలాగ్ చెప్పించడంతో ఎండ్ చేసినట్లు సమాచారం

భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చారిత్రిక నేపథ్యంలో రూపొందిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి లుక్ రివీల్ అయింది.

అయినప్పటికీ టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేయనుంది చిత్రబృందం. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టీజర్ ఎలా ఉందనే విషయంపై ఓ వార్త హల్చల్ చేస్తోంది. టీజర్ నిడివి 60 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం.

ఈ టీజర్ లో కేవలం మెగాస్టార్ లుక్ మాత్రమే రివీల్ చేయనున్నారు. అది కూడా టీజర్ చివరిలో అని తెలుస్తోంది. టీజర్ మొత్తం బ్రిటీష్ జనాలు, ఒక కోట ఇలా సాగుతూ చివరగా ఉయ్యాలవాడ గెటప్ లో చిరు లుక్ ని రివీల్ చేస్తూ ఓ డైలాగ్ చెప్పించడంతో ఎండ్ చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. 

ఇది కూడా చదవండి..

'సై రా' టీజర్ పై మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్!

loader