మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ చిరు పుట్టినరోజు (ఆగస్టు 22) కానుకగా ఒకరోజు ముందుగా విడుదల చేయనున్నారు.

రేపు ఉదయం 11 గంటల ముప్పై నిమిషాలకు టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా టీజర్ రెడీ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'సై రా టీజర్ కోసం నేను కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి చారిత్రిక సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తయింది. ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

నిజానికి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను అనుకున్నారు ఆయన తప్పుకోవడం థమన్, కీరవాణి ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా అమిత్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.