Asianet News TeluguAsianet News Telugu

ఓం నమో వెంకటేశాయ బయ్యర్ల లో ఆందోళన

  • ఓం నమో వెంకటేశాయ చిత్రానికి పాజిటివ్ టాక్
  • ప్రేక్షక్షుల నుంచి మంచి స్పందన వస్తున్నా బయ్యర్లలో ఆందోళన
  • రిటర్న్స్ పై కలవరపడుతున్న ఓం నమో వెంకటేశాయ బయ్యర్లు
om namo venkateshaya buyers worry

నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రానికి పాజిటివ్ టాక్‌ వినిపిస్తోంది. 'అన్నమయ్య' బృందం మరో చెప్పుకోదగ్గ భక్తిరస చిత్రం అందించిందని చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. ఏడుకొండలవాడి భక్తులకి తప్పకుండా నచ్చుతుందంటూ కితాబులు ఇస్తున్నారు. ఇంత వరకూ బానే వుంది.

 

కానీ ఓంనమో వెంకటేశాయ సినిమాకు తొలి రోజున వచ్చిన వసూళ్లు బయ్యర్లకి షాకిచ్చాయి. భక్తి చిత్రాలకి మామూలు సినిమాల కంటే తక్కువ ఓపెనింగ్స్ రావడం సహజమే కానీ, ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడికి వస్తోన్న రిటర్న్స్‌కి పోల్చుకుంటున్న బయ్యర్లు బాగా వర్రీ అవుతున్నారు. టాక్‌ బాగుంది కనుక ముందు ముందు పికప్‌ అవుతుందని ఆశ పడుతున్నప్పటికీ గతంలో మాదిరిగా ఎప్పుడో రెండు, మూడు వారాలకి పుంజుకుంటుందిలే అనే పరిస్థితి ఇప్పడు లేదు. సినిమా భవిష్యత్తే పది రోజుల్లో అటా ఇటా తేలిపోతోంది.

 

వచ్చే వారం, ఆపై వారం కూడా చాలా చిత్రాలు విడుదలకి సిద్ధంగా వున్నాయి. దీంతో ఓం నమో వెంకటేశాయకి ఎక్కువ స్పేస్‌ అయితే లేదు. శని, ఆదివారాల్లో ఎంత వెనక్కి రాబట్టుకుంటుందనే దానిపై బయ్యర్లు గట్టెక్కుతారా లేదా అనేది  అంచనా వేయచ్చు. థియేటర్ల నుంచి ఈ చిత్రానికి ముప్పయ్‌ అయిదు కోట్ల వసూళ్లు రికవర్‌ కావాల్సి వుంది.

 

ఆ శ్రీనివాసుడి అండతో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతుందో లేదో. ఓం నమో వెంకటేశాయ..

Follow Us:
Download App:
  • android
  • ios