భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపించబోతున్నారు అన్నప్పటి నుంచి ఆ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలా రోజుల అనంతరం దర్శకుడు రాజమౌళి ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.  ఫారిన్ కి సంబందించిన యాక్టర్స్ పాత్రలను రివీల్ చేసేశారు.

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ జెన్నిఫర్ పాత్రలో నటిస్తుండగా మెయిన్ విలన్ గా హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ సన్ ని ఫైనల్ చేశారు. అతని లుక్ ని కూడా రివీల్ చేసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. అలాగే విలన్ వైఫ్ క్యారెక్టర్ లో అలిసన్ డూడిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ యాక్టర్స్ పేర్లు ఇప్పుడు ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ గాసిప్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగు హిందీ తమిళ్ భాషల్లో డైరెక్ట్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా  మలయాళం కన్నడ భాషల్లో అనువాదం కానుంది. అయితే ఈ 5భాషలతో పాటు మరో 5 భాషల్లో కూడా RRR సినిమాను రిలీజ్ చేయాలనీ దర్శకుడు రాజమౌళి బిగ్ ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!  

డివివిదానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే అజయ్ దేవ్ గన్ - అలియా భట్ - సముద్రఖని వంటి వంటి స్టార్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్న జక్కన్న ఇప్పుడు మరికొంత మంది హాలీవుడ్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంతో సినిమా రేంజ్ మరోస్థాయికి పెరిగింది. 2020 జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.