ముగిసిన దాసరి నారాయణరావు అంత్యక్రియలు దర్శక రత్నం దాసరికి కన్నీటి వీడ్కోలు పలికిన తెలుగు సినీ పరిశ్రమ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు హాయరైన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దాసరి చితికి నిప్పంటించిన ఆయన పెద్ద కుమారుడు

తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు అంత్య క్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. మొయినాబాద్ లోని దాసరి ఫామ్ హౌజ్ లో జరిగిన అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై దాసరికి కడసారి వీడ్కోలు పలికారు. దాసరికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా అభిమానులు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ కు తరలి వచ్చారు.

దాసరి పెద్ద కుమారుడు హరిహర ప్రభు ఆయన చితికి నిప్పంటించగా.. వేలాది మంది ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు.