పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు`తోపాటు మరో మూవీ `ఓజీ` కూడా ఉంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా వేగంగా తన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన `హరిహర వీరమల్లు` మూవీని పూర్తి చేశారు. ఇది మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పవన్ నుంచి సినిమా లేకపోవడంతో అభిమానులు ఆయన చిత్రాల కోసం వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది పవన్ టీమ్. మరో సినిమాని పూర్తి చేశారు పవన్. `ఓజీ` మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా టీమ్ ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీ ఫైరింగ్ కంప్లీట్
`ఫైరింగ్ ఫినిష్డ్` అంటూ ఈ విషయాన్ని వెల్లడించింది. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. `హరిహర వీరమల్లు` కంటే ముందే ఈ మూవీని పూర్తి చేయాలని పవన్ భావించారు.
కానీ అప్పట్లో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో `హరిహర వీరమల్లు`ని ఫస్ట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు కాస్త లేట్ అయినా `ఓజీ` చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.
ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి టీమ్ శ్రమిస్తుంది. రిలీజ్ డేట్‌ని మరోసారి వెల్లడించింది.
`ఓజీ` మూవీ రిలీజ్ డేట్‌పై టీమ్ మరోసారి క్లారిటీ
సెప్టెంబర్ 25న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు గతంలో వెల్లడించారు. ఇప్పుడు మరోసారి దీన్ని కన్ఫమ్ చేశారు. `ఓజీ` వాయిదా పడుతుందనే రూమర్స్ ఇటీవల వ్యాపించిన నేపథ్యంలో అప్పుడే నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పుడు కొత్త పోస్టర్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చింది. రూమర్లకి చెక్ పెడుతూ సెప్టెంబర్ 25న రిలీజ్‌కి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు వెల్లడించింది.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ పవన్‌కి జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఆయనతోపాటు శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ముంబాయి గ్యాంగ్ స్టర్ ప్రధానంగా `ఓజీ` మూవీ
`ఓజీ` మూవీ ముంబాయి గ్యాంగ్ స్టర్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. సినిమాలో మహిళా సెంటిమెంట్, బ్రదర్, సిస్టర్స్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని, దాని చుట్టే సినిమా సాగుతుందని గతంలో శ్రియా రెడ్డి వెల్లడించింది.
సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఇలాంటి సెంటిమెంట్, ఎమోషన్స్ బలంగా ఉంటాయని, అదే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని వెల్లడించారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మరింత ఆతృతతో ఉన్నారు.
పవన్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్‌లో కనిపించినా `ఓజీ ఓజీ` అంటూ అరుస్తుంటారు. దీని బట్టి ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు పవన్. జులై 24న `హరిహర వీరమల్లు` రిలీజ్ అవుతుండగా, రెండు నెలల గ్యాప్‌తో `ఓజీ` ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ కిది పండగే అని చెప్పొచ్చు.