- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణతో పోటీపడి కోలుకోలేని దెబ్బ తిన్న చిరంజీవి.. పర్వతం ముందు చిరు పోరాటం నిలబడలేదు
సూపర్ స్టార్ కృష్ణతో పోటీపడి కోలుకోలేని దెబ్బ తిన్న చిరంజీవి.. పర్వతం ముందు చిరు పోరాటం నిలబడలేదు
సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. అయితే ఇందులో చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టారు సూపర్ స్టార్ కృష్ణ.
- FB
- TW
- Linkdin
Follow Us

కృష్ణతో పోటీలో దెబ్బతిన్న చిరంజీవి
తనకంటే చాలా లేట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులకు పోటీ ఇచ్చారు. ఇమేజ్ పరంగా, సినిమాల సక్సెస్ పరంగానూ గట్టి పోటీ ఇచ్చారు. కొన్నిసార్లు వారిని మించి విజయాలు సాధించారు.
అయితే ఓ సారి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ.. చిరంజీవిని గట్టిగా దెబ్బకొట్టారు. అది సంక్రాంతి పోటీలో కోలుకోలేని దెబ్బ కొట్టడం విశేషం. మరి అది ఎప్పుడు జరిగింది, ఏ సినిమా విషయంలో జరిగిందనేది చూస్తే..
సంక్రాంతికి వచ్చిన కృష్ణ `అగ్ని పర్వతం`
సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి పోటీ పడింది 1985లో. ఈ ఏడాది కృష్ణ నటించిన `అగ్ని పర్వతం` సినిమా విడుదలైంది. ఇది సంక్రాంతికి వచ్చారు. భారీ విజయాన్ని సాధించింది.
అప్పుడు కృష్ణ స్టార్‌డమ్ పీక్లో ఉంది. ఆయన మాస్, యాక్షన్ సినిమాలతో బాక్సాఫీసుని షేక్ చేస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే `అగ్నిపర్వతం`.
సంక్రాంతికి జనవరి 11న విడుదలైన ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది.
`అగ్నిపర్వతం` సంచలన విజయం
`అగ్ని పర్వతం` సినిమాకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, అశ్వినీదత్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ రూపొందింది.
ఇందులో కృష్ణకి జోడీగా రాధ కనిపించింది. విజయశాంతి సైతం మెరిసింది. ఇందులోని `అగ్నిపెట్టి ఉందా?` అని కృష్ణ చెప్పే డైలాగ్‌లకు థియేటర్లు ఊగిపోయాయి.
ఆవేశంతో సూపర్ స్టార్ చెప్పిన ఇలాంటి మాస్ డైలాగ్‌లు సినిమాని వేరే రేంజ్‌కి తీసుకెళ్లాయి. బాక్సాఫీసు వద్ద ఇది కాసుల వర్షం కురిపించింది. ఎనిమిది సెంటర్లలో 125 రోజులు ప్రదర్శించబడింది.
కృష్ణకి పోటీగా సంక్రాంతి బరిలో `చట్టంతో పోరాటం`
ఇదే ఏడాది చిరంజీవి నటించిన `చట్టంతో పోరాటం` విడుదలైంది. కృష్ణ మూవీ రిలీజ్ అయిన రోజే జనవరి 11న ఈ చిత్రం కూడా రిలీజ్ అయ్యింది.
అప్పటికే `ఖైదీ`తో స్టార్ డమ్ అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా సక్సెస్ లు సాధించి జోరుమీదున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ లోటుని చిరంజీవి భర్తీ చేస్తున్నారని అంతా భావిస్తున్నారు.
అలాంటి సమయంలో కృష్ణకి పోటీగా `చట్టంతో పోరాటం` సినిమాతో పోటీ పడ్డ చిరంజీవి బోల్తా కొట్టాడు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. డీలా పడిపోయింది. సంక్రాంతి బరిలో కృష్ణ ముందు చిరు పోరాటం ఫలించలేకపోయింది.
`అగ్ని పర్వతం` ముందు నిలబడలేకపోయిన `చట్టంతో పోరాటం`
`చట్టంతో పోరాటం` చిరంజీవికి 75వ సినిమా కావడం విశేషం. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యాక్షన్ ప్రధానంగానే వచ్చిన ఈ మూవీకి కె బాపయ్య దర్శకత్వం వహించారు. కె దేవీ వరప్రసాద్ నిర్మించారు.
ఇందులో చిరంజీవి సరసన మాధవి, సుమలత నటించగా, రావు గోపాలరావు నెగటివ్‌రోల్ చేశారు. కె చక్రవర్తి సంగీతం అందించారు.ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది.
కానీ ఇదే ఏడాది `దొంగ`తో హిట్‌ని అందుకున్నారు. `చిరంజీవి`, `జ్వాలా`, `పులి`, `రక్తసింధూరం`, `అడవిదొంగ`, `విజేత` చిత్రాలు చేశారు. వీటిలో `అడవి దొంగ`, `విజేత` మంచి హిట్లుగా నిలిచాయి.
చిరంజీవికి రిలీఫ్‌నిచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర`, `మెగా 157` చిత్రాలతో బిజీగా ఉన్నారు.