వర్మ 'ఆఫీసర్' వాయిదా!

వర్మ 'ఆఫీసర్' వాయిదా!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందించిన చిత్రం 'ఆఫీసర్'. నిజానికి ఈ సినిమా మే 25న విడుదల కావాల్సివుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 1కి వాయిదా వేసినట్లు దర్శకుడు వర్మ స్వయంగా ప్రకటించారు. కొన్ని సాంకేతిక కారణాల వలన సినిమాకు కొన్ని తుది మెరుగులు దిద్దుతుండడం వలన ఆలస్యమవుతుందని వర్మ అన్నారు.

నిజానికి ఈ సినిమా ప్రివ్యూని కూడా నాగార్జునకి చూపించారు. అలాంటిది ఇప్పుడు సాంకేతిక కారణాలు ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ఈ సినిమా బిజినెస్ అనుకున్నట్లుగా జరగలేదు. సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవడంతో బయ్యర్లు ఈ సినిమాను కొనడానికి ముందుకు రావడం లేదు. ఆ కారణంగానే సినిమాను వాయిదా వేసి ఉండొచ్చని అంటున్నారు.

అలానే మే 25న రవితేజ 'నేల టికెట్టు' అలానే కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండు సినిమాలతో పోటీ పడడం ఇష్టంలేని వర్మ కావాలనే తన సినిమాను వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నాడని అనేవారు కూడా ఉన్నారు. కారణం ఏదైనా.. నాగార్జున 'ఆఫీసర్' మాత్రం అనుకున్న సమయానికి రావడం లేదు.జూన్ 1న రాజ్ తరుణ్ నటించిన 'రాజుగాడు' చిత్రంతో పాటు 'ఆఫీసర్'ను కూడా విడుదల చేయనున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos