Asianet News TeluguAsianet News Telugu

వారి సినిమా పాట... దూకుతున్న బూతు జలపాతం

పూర్వం ఆకాశవాణిలో పాటల సమయానికి పిల్లపెద్దా కలిసి చేరి వినేవాళ్లం.రికార్డులు కొనేవారు, పాతిక రూపాయల కేసెట్ కొని పది రూపాయలిచ్చి కోరిన పాటలు రికార్డ్ చేయించుకునే వారు. పాట సామూహిక ఆనందానికి బాట. ఈ గీత రచయితల నికృష్టులు కొంపల్లో తమ పాటలయినా వింటున్నారా? సిగ్గు గుత్తి తెంచాడు,టెంటు మీద బాంబేసాడు..రింగరింగా అంటూ ఈ పాటలు ఇంట్లో వాళ్లతో కలిసి వినగలరా? తమ పిల్లలతో పాడించగలరా...

 

obscenity unleashed in telugu movies songs

 

వేటూరి నిష్క్రమణ,సిరివెన్నెల అనారోగ్యం వల్ల సినీ సాహిత్యం అంపశయ్య మీదుంది.

నేనెక్కువగా మెదడులేని దర్శకులతో పనిచేసాను.వాళ్లు నా మాటలు వినేవాళ్లు కాదు.

రాజమౌళికి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం అతను నేను చెప్పింది వింటాడు....

ఇంకా నాలోని రచయితను చూసి గర్విస్తాను..ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలు జాలువార్చాడు.

నిజానికి రాజమౌళి,కీరవాణి కాంబినేషన్లో వచ్చిన్ పాటల సాహిత్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం..

.వీరు చాలా సినిమాలు తీసేవరకు వేటూరి బతికే ఉన్నారు.

 

స్టూడెంట్ నం-1

 

ఏమెట్టి పెంచిందే మీ అమ్మా....రంభాఊర్వశిమేనక మేని చెమటతోనా అని నాయకుడంటే కాముడు పంపిన కోడి పులుసుతోనా అని నాయిక అడుగుతుంది.

 

నాయకుడు కనకదుర్గకు మొక్కుకున్నా..కళ్లు కొట్టుకుంటానని,కౌగిలించుకుంటానని అని అంటే నాయిక సాయిబాబాకు మొక్కుకున్నా సంధి చేసుకుంటానను,నీతో సందులోకి వస్తాననని అంటుంది.ఇంకా మూడు కళ్ల శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని అంటుంది.

 

సింహాద్రి

 

ఈ పాటకు ముందు ఒక కేతిగాడు ఇలా పాడుతాడు.

కస్తూరి భంగు భంగు

కావేరి మింగు మింగు

పిల్లతో పింగు పాంగు

చిత్రాల చిందేసి సింగు సాంగు

----జింగుల్లో జింగ దొరికిందే దొంగ ముద్దే ఇవ్వంగ

నీ మూతే బుంగ కస్సుబుస్సై పోవంగ

చీమ చీమ చీమ....

 

మరోపాట...

 

చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగ...చీకులమ్మే చిన్నది కావాలా

గుమ్మలూరిపిల్లా నా సమ్మలోరి కిల్లా

చెక్కేస్తే ఎల్లా చేస్తాను గుండెగుల్లా...లస్కుటపా లజ్జులు కావాలా?

దానిమ్మలిచ్చే ఉస్కుటపా ఊపులు కావాలా?

 

ఇంకోపాట...

 

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి

అది వినపడుతుంటే అలజడిరేగి జారుతుంది మిడ్డీ..

 

సై

 

గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా

నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా

అమ్మనడిగితే ఊహూ అంది,అల్లుడింటికే పోపో అంది

బెల్లం పెడతావో,ఎక్కడ సున్నం పెడతావో నీకు దండం పెడతా,దయచూడమంటా

నోట్లో ఉంది కొబ్బరి చెక్క బెట్టుబెట్టుగా

రోకలిపడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా

అత్తనడిగితే నవ్వేసింది..మరదలింటికే పోపో అంది

కొబ్బరి పెడతావో,అరిచి బొబ్బలు పెడతావో..నీకు సాయంగుంటా

 

ఛత్రపతి

 

నీకు బోలెడు అది ఉంది,నాకు బుట్టెడు ఇది ఉంది.

ఎత్తిపోతల పదునుంది,ఉక్కపోతల పనిఉంది.

మత్తులో గమ్మత్తులో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈదిఈది

చాటుల్లోమాటుల్లో ఆడే ఆటల్లోనా మారాలి తేలితేలి

స్త్రీలంతా చూడాలింకా నాతో పుడ్డింగా చీపో అనక

నచ్చావయ్యా ఉగ్రవాది...గుండుసూది గుచ్చుకుంది...

మన్నేల తింటివిరా కృష్ణా అంటూ...

నీకు కాశ్మీరు ఆపిల్స్ లేవా?అరే పాలకొల్లు బత్తాయిలు లేవా?

నీకు వడ్లమూడి నారింజలు లేవా?అయ్యో కాబూలు దానిమ్మలు లేవా?

పాలముంతలు నీకు పరువంగా చేయిస్తి.....

-----

పండుకోయగలవా?దాని తొక్క తీయగలవా?

తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా?

పండు కోయగలనే,దాని తొక్కతీయగలనే..పక్కలో మగ దిక్కునై రసముక్కు తీర్చగలనే.

వలచ్కో వాటేసి వయసు వరహా...అదరహో అందాల ఆడతరహా.....

గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్ట గలవా?.......గలగల గజ్జల గ్రంధసాంగి...

 

విక్రమార్కుడు

 

కాలేజ్ పాపల బస్సు,ఏ సీటు చూసిన ఫ్రెస్షు...బ్రేకేస్తే పెద్ద ఇష్యూ మన్మధుని డిష్యూం డిష్యూ

జింతాత జింతాత జింతాతా....

టెన్నీసు అమ్మడు కోర్టంతా దున్నుడు,వంగి షాట్ కొట్టిందీ గ్రొండ్ అదరగొట్టింది

ఓ టెన్నీసు బంతుల పాపా నీ బంతులకంతటి ఊపా?

అది అత్తిలి తోటల కాపా?నీ గుత్తుల సోకుల తీపా?నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకు గ్లూకోజు....

నైటు డ్యూటి నర్సు కనిపెట్టినాది పల్సు ప్యాంటూడదీయమంది పొడిచింది పెద్ద సూది.

----

 

గడపనా నీతో గంటల కొద్దీ..అయ్ బాబోయ్ ఆ తరువాతేమైపోద్దీ..

అయిదే నిమిషాలైనా అది సరిపోద్దీ..ఆశదోస అప్పడం ఇది యేం బుద్ధి....ఝుం ఝుం మాయో..

మగధీర.

పైట నలిగితే మా అమ్మ ఒప్పుకుంటదేటి,బొట్టు కరిగితే మా బామ్మ ఊరుకుంటదేటి..అదే జరిగితే ఓలమ్మో!అత్తమ్మ తట్టుకుంటదేటి?

 

మర్యాదరామన్న

 

రాయే రాయే రాయే సలోనీ,జాము రాత్రి సందుచూసి జంపు జిలాని.

గూటిలోన గుట్టుగా మందిలోన మత్తుగా చేద్దామా గూడుపుఠాణి...పగటిపూట దొంగలా మాపటేళ కింగులా గోడ దూకి నిన్ను చేరి గోకుతుంటే.

జిలానీ జంపుతో జనాల తిక్క కుదురుతుంటే...

యమదొంగ.

రోజూ రోజూ తోటకు వెళ్లి డీడిక్కంటూ లవ్వాడేద్దం పిల్లా...

..

రసిక గుణరామా సరసకుల సోమా...వలపు రణధీమా మొదలుపెడదామా...

ఏక్ పల్ ఇక పైకి వస్తా...ఏక్ పల్ సెగబాకీలిస్తా..ఏక్ పల్ సుఖశోకాలిస్తా...ఏక్ పల్ సిరి మూటలు విప్పిస్తా...

అబ్బ నన్నేం చేస్తాడొ ఈ పిల్లోడు..లంకె బిందెల్లో పాలే పోసి తోడేస్తాడు...

బిందె నిండిపోయిందంటూ బరువు మొయ్యలేవంటూ సాయం చేస్తే తప్పేమంటాడు?

సాయమేమి కాదు చెయ్యి కొంత జరిపి నడుముకు పైనే ఆడిస్తాడు....

 

ఈ విధంగా ఒకటా రెండా.. ఈ అపూర్వ సోదరలు సినీ పాటల నందనవనం లో గొప్ప సాహితీ సౌరభాల సుమాలను విరబూయించారు..

ఇతర గీత రచయితలు,దర్శకుల మీద నిష్టూరాలాడే కీరవాణి ఎందుకు తన కుటుబ ప్యాకేజ్ లా తీసే సినిమాల్లో గొప్ప పాటలు రాయించుకోలేక పోయాడు?

 

అసలు ఈపాటలలనూ మ్యూట్ చేసి వినండి..జుగుప్సాకర కామభంగిమలు తప్ప మరేం కాదు...

పనీపాట అన్నారు పెద్దలు..పని నుంచే పాట పుట్టింది...ఆ తర్వాత దానికో శాస్త్రీయత తెచ్చుంటారు...

 

ఏ విధమైన సంగీత,సాహిత్యాలైనా అదో సామూహిక కార్యక్రమం...

 

జానపదాల్లో,పల్లె పాటల్లో పని చేస్తూ ప్రధాన గాయనీ/గాయకుడు మొదలు పెడితే మిగిలిన వాళ్లు వంతగా పాడుతారు...శాస్త్రీయ సంగీతమైనా ప్రేక్షకుల/వీక్షకుల ముందే ఆలపిస్తారు...

ఇక ఈ గీత రచయితలు,పాట సౄష్టికి మూలమైన పెద్దలంతా కూర్చుని మాస్ జనాలకోసం అంటూ కబుర్లు చెబుతారు...

ఏ మాస్ జనాలు?కొన్ని దశాబ్దాల క్రితం నిరక్షరాస్యులు శివశంకరి పాట పాడి బహుమతులు పొందలేదా?

మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ(అభినవ తారవో),ప్రాగ్దిశ వీణియపైనా దినకర మయూఖ తంత్రులపైనా జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైనా(విధాత తలపున ప్రభవించినది)..లాంటి పెద్ద పెద్ద సమాసభొయిష్టమైన పాటలు సామాన్య జనం ఆదరించలేదా?

ఆ డెబ్బయ్యవ దశకం లో కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ కసికసిగ చూస్తినే చిన్నమ్మీ,లేవనంటావా నన్ను లేపమంటవా పాటలు రాసిన ఆత్రేయ ను బూత్రేయ అన్నారు...

ఆ తర్వాత ఒక నికృష్ట పండితుడు వేటూరి వచ్చాడు...సినీ సాహిత్యాన్ని ఎంతలా దిగజార్చాలో అంతలా దిగజార్చాడు...కాకుంటే మహాపండితుడు,ఆయన వాడిన అలంకారాలు ఇవీ అని ఏకరువు పెడతారు కానీ సిరివెన్నెల ఆ తర్వాత వచ్చినా ఏరోజూ ఇలా భ్రష్టు,రోతకూతలు రాయలేదు...

గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా,తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో...అట్టంటే నా కోడి కూసేస్తది,చిట్టింటి నీ గింజ మేసేస్తది......

ఈ నికృష్ట రచయితలు ఎదురుపడితే అడగాలనిపిస్తుంది...

మీ అమ్మాయిలకు వాళ్ల బావ  బెల్లం పెట్టా డా  లేదా?మీ అవిడ చిట్టింటి గింజలు మీ కోళ్లు తిన్నాయా లేదా?అని.

ఇంట్లో వాళ్లేం చేసారు? అంటారా?

పైన చెప్పుకున్నట్లు పాట ఒక సామూహిక కార్యక్రమం...ఆకాశవాణిలో పాటల సమయానికి పిల్లపెద్దా కలిసి చేరి వినేవాళ్లం...రికార్డులు కొనేవారు కొందరు..ఆ తర్వాత పాతిక రూపాయల కేసెట్ కొని పది రూపాయలిచ్చి కోరిన పాటలు రికార్డ్ చేయించుకుని...కెఫె ల్లో వినడం..ఏదేమైనా అందరం కలిసే విన్నాం....

ఈ గీత రచయిత నికృష్టులు కొంపల్లో ఈ పాటలు వింటున్నారా?

సిగ్గు గుత్తి తెంచాడు,టెంటు మీద బాంబేసాడు..రింగరింగా అంటూ ఈ పాటలు ఇంట్లో వాళ్లతో కలిసి వినగలరా?

వీళ్ల పిల్లలతో ఈ పాటలు పాడిస్తారా?

అయ్యా కీరవాణిగారూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు సుద్దులు చెప్పినా...ఒక చర్చకు మాత్రం కారకులయ్యారు...

మాలాంటి సామాన్య సినీ సంగీత ప్రేమికులకు ఇన్నాళ్లూ మా అభిప్రాయాలు తెలిపే వేదిక లేదు..ఇదుగో ఈ సోషల్,వెబ్ మీడియాల పుణ్యమా అని చెప్పగలుగుతున్నాం...

మీ దగ్గరికొచ్చే భజన పరులు,సినీ జర్నలిస్టులనే కిటికీల నుంచి కాకుండా సామాన్య ప్రేక్షకుల మనోవీధుల్లోకి వచ్చి మా అభిప్రాయాలూ తెలుసుకొండి. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios