ఇప్పుడున్న హీరోలలో పౌరాణికం చేయాలన్న డైలాగులు అలవోకగా చెప్పాలన్న ఎన్టీఆర్ తర్వాతే. నిన్న జిమ్ లో వర్కౌట్ చేస్తు రిలీజ్ అయిన ఒక్క పిక్ సోషల్ మీడియా మొత్తాన్ని స్తంభించేలా చేసింది. ఆహార్యం దగ్గరి నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతీది కొత్తగా చూపించాలన్నతారక్ ఎప్పుడు తపిస్తుంటాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడదే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పేందుకు నెట్‌లో వైరల్ అవుతున్న ఓ ఫోటోనే ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు. అయితే ఈ కష్టమంతా రాజమౌళి కోసమా?.. లేక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కోసమా? అన్నది పెద్ద సస్పెన్స్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం పూర్తిగా కొత్త గెటప్ లో కనిపించనున్న తారక్.. అందుకోసం బాడీ ఫిట్‌నెస్‌పై ఫుల్లుగా ఫోకస్ చేశాడు. హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో బాడీ రూపు రేఖలు మార్చేలా వర్కౌట్స్ చేస్తున్నాడు.ఫిట్‌నెస్ కసరత్తుల్లో భాగంగా తారక్ చేస్తున్న వర్కౌట్స్ కు సంబంధించి తాజాగా ఓ ఫోటో బయటకు లీక్ అయింది. కండలు తిరిగిన దేహంతో ఫోటోలో ఎన్టీఆర్ కనిపిస్తున్న తీరు జిమ్‌లో ఆయన ఎంతలా కష్టపడుతున్నారో చెప్పకనే చెబుతోంది.


ఎన్టీఆర్ జిమ్ కసరత్తులు చూస్తుంటే..  రాజమౌళి తీయబోయే సినిమా కోసమే ఇంత కష్టపడుతున్నాడు అని గాసిప్స్ కూడా చాలా వస్తున్నాయి. అంతర్గతంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికీ మొదలైపోయిందనేది కొంతమంది వాదన. రాజమౌళి తెరకెక్కించబోయే ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టే.. ఎన్టీఆర్ ఇంతలా కష్టపడుతున్నారని అంటున్నారు.

నిజానికి అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? అని చాలామంది అనుమానించారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో మూవీకి 'సై' అన్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్‌ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. ఓవైపు ఈ సినిమా చేస్తూనే.. మరోవైపు రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా షూటింగ్ లోనూ ఎన్టీఆర్ పాల్గొంటారని వినికిడి.