తారక్, త్రివిక్రమ్ కాంబినేషనా మజాకా.. కళ్లు చెదిరే బిజినెస్

NTR Trivikram movie Overseas bussiness completed
Highlights

తారక్, త్రివిక్రమ్ కాంబినేషనా మజాకా

 మామూలుగానే తారక్ సినిమాలకు టాక్ తో పని లేకుండా రికార్డులు కొడుకుంటాగడు. టెంపర్ నుండి ఆయన మార్కెట్ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది.  ఐతే ఈ కాంబినేషన్ కుదిరిన టైమింగ్ మాత్రం జనాలకు నచ్చలేదు. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తీసిన తర్వాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో జత కట్టడం నందమూరి అభిమానుల్ని నిరాశ పరిచింది. కెరీర్లో ఇంత దారుణమైన సినిమాని ఎప్పుడు తీయలేదు. అసలు త్రివిక్రమ్ తీసాడా అన్న సందేహాలు చాలా మందికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా విషయంలో అభిమానులు కొంత ఆందోళనతో ఉన్న మాట కూడా వాస్తవం. ఈ సినిమాకు ఆశించినంత బజ్ ఉంటుందా అన్న సందేహాలు రేకెత్తాయి. ఐతే ‘అజ్ఞాతవాసి’ ఫలితంతో సంబంధం లేకుండా ట్రేడ్ వర్గాల్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు బాగానే డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హక్కుల కోసం పోటీ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ ఇంకా ఆరంభ దశలో ఉండగానే ఈ చిత్ర యుఎస్ హక్కుల అమ్మకం పూర్తయినట్లు సమాచారం. యుఎస్ హక్కులు  రూ.12 కోట్లు పలికాయి. ఇది తక్కువేమీ కాదు. ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు కొంతమేర నష్టాలు సెటిల్ చేయడంతో మరోసారి రాధాకృష్ణ మీద నమ్మకంతో బయ్యర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు.అంతే కాదండోయ్ తెలుగు రాష్ర్టాల్లో బర్యర్లు పోటీపడుతున్నారు. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తారక్ కు తిరుగులేదు దానికితోడు త్రివిక్రమ్ కలిసాడు. ఇంకేముంది యావరేజ్ టాక్ వచ్చిన ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ రికార్డలు కొట్టడం మాత్రం పక్క. ఇక యూఎస్ ఇద్దరికి తిరుగులేని మార్కెట్ ఉంది. యూఎస్ లో వరుసగా మూడు 1.5 మిలియన్లు ఉన్న హీరో ఎన్టీఆర్ ఒక్కడే.

loader