ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ గనుక చూసుకుంటే.. లవర్ బాయ్ తరహా పాత్రల్లో చేసింది లేదు. చాలా వరకు మాస్ కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ క్లాస్ క్యారెక్టర్లకు దూరం. ఈ మధ్యనే తన పంధాను మార్చుకొని 'నాన్నకు ప్రేమతో' సినిమాలో క్లాస్ లుక్ లో కనిపించాడు. అయితే పూర్తి స్థాయి లవర్ బాయ్ గా మాత్రం కనిపించలేదు. ఈసారి ఆ ముచ్చట కూడా తీర్చబోతున్నాడు యంగ్ టైగర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమాలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపిస్తాడని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త క్లాస్ టచ్ ఇస్తున్నారట. 

తన పాత్రలో లవర్ బాయ్ లక్షణాలు ఎక్కువ, యాక్షన్ తక్కువగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమే త్రివిక్రమ్ కు చెప్పి ఆ ప్రకారమే కథ సిద్ధం చేయమని సూచించాడట ఎన్టీఆర్. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బరువుని తగ్గించుకునే పనిలో పడ్డాడు. 

 

ఇవి కూడా చదవండి

https://goo.gl/fUzbFo

https://goo.gl/7z2xZq