Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ స్టార్ మా బిగ్ బాస్ షోకు లీగల్ కష్టాలు

  • స్టార్ మా ఛానెల్ రేటింగ్స్ ను టాప్ కి తీసుకెళ్లిన బిగ్ బాస్ షో
  • బిగ్ బాస్ రియాలిటీ షోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు
  • స్పందించి నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన మానవహక్కుల కమిషన్
ntr star maa big boss show in legal troubles

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనుకోకుండా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కొంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈకార్యక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని శనివారం మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఈ వారంలో విచారణకు రానున్నది అని తెలుస్తోంది.

 

మానవ హక్కుల కమిషన్‌లో ఈ షో పై కేసు నమోదు కావడం పై  ఈ షో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.  దీనితో ఈ వ్యహారం పై ఎలా స్పంధించాలి అనే విషయం పై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ‘బిగ్‌ బాస్’ ఇంట్లో ఉంటున్న సెలబ్రిటీలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు అని ఆ శిక్షలు మానవ హక్కుల ఉల్లఘన మాత్రమే అంటూ ఈ ఫిర్యాదు చేసిన వారి వాదన అలాంటి శిక్షలు అమలు చేసే అధికారం కోర్టులకు లేదు. అంతేకాదు ఈ ఫిర్యాదులో అనేక అంశాలను కూడ ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

 

ఇటీవల బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఎంపిక కావడానికి ప్రయత్నించిన ప్రిన్స్ కు బిగ్ బాస్  స్విమ్మింగ్ పూల్‌ లో 50 మునకలు వేయాలంటూ బిగ్‌ బాస్ విధించిన శిక్ష మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణ. అంతేకాదు ఈ షోలోని మరొక పార్టిసిపెంట్ ముమైత్‌కు నోటికి కొన్ని గంటలపాటు స్టిక్కర్ వేయడం కూడ మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని అంటున్నారు. 

 

శిక్షల పేరుతో ఆహారం తినకుండా, శ్వాస పీల్చుకోకుండా శిక్షలు వేసి బిగ్ బాస్ శిక్షలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి అభిప్రాయ పడుతున్నాడు. ఈకార్యక్రమాన్ని ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు చూస్తున్న నేపధ్యంలో వారి మానసిక స్థితి పై ఈ శిక్షలు వేసే కార్యక్రమం అనేక వింత ఆలోచనలకు తావు ఇచ్చేదిగా ఉంటుందని ఈ ఫిర్యాదుదారుడు అభిప్రాయ పడుతున్నాడు. 

 

గతంలో ఓంకార్ నిర్వహించిన ఆట షో పై కూడ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదులు వచ్చాయి. అయితే అటువంటి ఫిర్యాదులను లెక్క చేయకుండానే ఆ షో విజయవంతంగా ప్రసారం చేయబడి అప్పట్లో మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. సామాజిక స్పృహతో మానవ హక్కుల కమిషన్ లో బిగ్ బాస్ షో పై ఫిర్యాదులు చేసినా వాస్తవ విషయాలను పట్టించుకునే స్థితిలో ప్రస్తుత మన వ్యవస్థలు ఉన్నాయా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios