ఎన్టీఆర్ ఇద్దరి కొడుకులు ఒకే ఫ్రేమ్ లో!

ntr reveals newborn son's pic
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇటీవల కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇటీవల కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అభయ్ రామ్ తరువాత మరో వారసుడు రావడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులను చూసుకొని తెగ మురిసిపోతున్నాడు ఎన్టీఆర్.

అభయ్ రామ్ తన తమ్ముడిని ఎత్తుకొని ఉన్నప్పుడు తారకు ఫోటో తీసే ప్రయత్నం చేయగా.. ఆ బ్యూటిఫుల్ ఫోటోను కాప్చర్ చేసింది ప్రణతి. ఇప్పుడు ఆ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తనకు కొడుకు పుట్టిన సందర్భంగా మూడు రోజుల పాటు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అరవింద సమేత' చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. 

 

loader