ఎన్టీఆర్ పై సినిమా తీయడం మంచిదేనన్న జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ సినిమాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వుంటుందన్న జూనియర్ బాలయ్య ఈ సినిమాలో చేయడం మంచిదే కదా అన్న ఎన్టీఆర్

స్టార్ మా టీవీ బిగ్ బాస్ షో లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం తనకు ఎంతో నచ్చిందని.. నెగెటివ్ రోల్ ద్వారా కూడా పాజిటివ్ ఇమేజ్ సంపాదించగలనన్న నమ్మకం కలిగినందునే ఆ పాత్ర చేశానని ఎన్టీఆర్ స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మహనీయుడు ఎన్టీఆర్ పై సినిమా తీయబోతున్నట్లు చేసిన ప్రకటనకు సంబంధించి కూడా మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్... మహనీయునిపై సినిమా తీయడం మంచిదేనన్నారు. అయితే ఎన్టీఆర్ ను కేవలం ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా తాను భావించనని, ఎన్టీఆర్ అంటే అందరివాడని ఎన్టీఆర్ అన్నారు. అలాంటి వ్యక్తి గురించి సినిమా తీసేటప్పుడు అన్ని అంశాలు చూపించాల్సి వుంటుందన్నారు.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారన్న ప్రశ్నకు స్పందించిన ఎన్టీఆర్ మంచిదే కదా బ్రహ్మాండం. అంతకన్నా ఇంకేం కావాలి అన్నారు. ఇలా ఒక్క పదంతో సమాధానం చెప్పి వూరుకోవడంపై నందమూరి ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు. ఇక.. బయోపిక్ లో అవకాశం ఇస్తే చేస్తారా.. అన్న ప్రశ్నకు సమాదానం చెప్పిన ఎన్టీఆర్... తాను ఇందులో చేయాలా వద్దా అనేదు ఆలోచించుకోలేదని స్పష్టంచేషారు.

మరోవైపు వర్మ సినిమా ప్రకటించిన తర్వాత అందులో ఏం వుండబోతోందనే అంశాలపై ఆసక్తి మరింత పెరిగింది. వీపీ సింగ్ ప్రధాని కావటంలో కీలకపాత్ర పోషించిన ఎన్టీఆర్ జీవితం చివరి దశలో వివాదాల మయమైంది. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ ను గద్దె దించిన వైనాన్ని ఈ సినిమాలో అ మేరకు చూపిస్తారోననే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కూడా అన్ని అంశాలు మేళవించి మహనీయున్ని అద్భుతంగా చూపించాలన్నారు. మరోవైపు తారక్ కమెంట్స్ తర్వాత,.. సినిమా పై మరింత ఒత్తిడి పెరిగిందనేది స్పష్టంగా తేలుతోంది.