'ఢీ' షో కోసం ఎన్టీఆర్ కు ఎంత ముట్టజెప్పారో తెలుసా..?

ntr remuneration for dhee program
Highlights

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోవైపు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ ఇప్పుడు టీవీ షోలలో కూడా కనిపించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి కథల ఎంపిక, అభిమానులతో మెలిగే తీరు, ఇతర హీరోలతో సన్నిహితంగా ఉండే అతడి ఆటిట్యూడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గతేడాది బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ కు కూడా దగ్గరైన ఎన్టీఆర్ తాజాగా ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ పదో సీజన్ ఫైనల్స్ కు జడ్జిగా వ్యవహరించాడు.

ఆయన పాల్గొన్న ఎపిసోడ్ కు టీఆర్పీ రేటింగ్స్ మాములుగా లేవు. ఫైనల్ ఎపిసోడ్ కి 13.9 టీఆర్ఫీ రేటింగ్స్ రావడం విశేషం. ఢీ చరిత్రలోనే ఇది అత్యధిక రేటింగ్ అని సమాచారం. ఎన్టీఆర్ జడ్జి కావడంతో షో కూడా రసవత్తరంగా సాగింది. ప్రదీప్ పై ఎన్టీఆర్ వేసిన పంచ్ లు, అతడి జోక్స్ షోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక పాటకు ఎన్టీఆర్ డాన్స్ కూడా చేశాడు. మరి ఈ షో కోసం ఎన్టీఆర్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయాన్ని ఆరా తీయగా.. కొన్ని గంటల షూటింగ్ కోసం ఆయనకు రూ.25 లక్షలు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది.

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోవైపు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ ఇప్పుడు టీవీ షోలలో కూడా కనిపించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఎన్టీఆర్ కనిపించిన ఈ ఎపిసోడ్ మొత్తం యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ లభించాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత' సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అక్టోబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

loader