Asianet News TeluguAsianet News Telugu

RRR:ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సంతకాలతో ఎగ్రిమెంట్స్

‘‘స్టార్‌ విలువ నాకు తెలుసు. స్టార్స్‌ని వాళ్ల అభిమానులకి, ప్రేక్షకులకు బాగా చూపించడంతోనే నేను ఈ స్థాయికి వచ్చా. అయితే ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే, వాళ్లు ఉత్సాహంగా థియేటర్‌కి రప్పించడం వరకే. ఒక్కసారి థియేటర్‌లోకి ప్రేక్షకుడు వచ్చాక నడిపించేది ఆ కథే అని నమ్ముతా. 

NTR Ram Charan Fans Associations Signing Agreements
Author
Hyderabad, First Published Dec 14, 2021, 11:04 AM IST


 స్టార్‌ విలువ నాకు తెలుసు. స్టార్స్‌ని వాళ్ల అభిమానులకి, ప్రేక్షకులకు బాగా చూపించడంతోనే నేను ఈ స్థాయికి వచ్చా. అయితే ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే, వాళ్లు ఉత్సాహంగా థియేటర్‌కి రప్పించడం వరకే. ఒక్కసారి థియేటర్‌లోకి ప్రేక్షకుడు వచ్చాక నడిపించేది ఆ కథే అని నమ్ముతా అని రాజమౌళి రీసెంట్ గా ఇంటర్వూలో చెప్పారు. స్టార్స్ ,కథ సరే..వాళ్ల ఫ్యాన్స్ పరిస్దితి ఏమిటి...సినిమా రిలీజ్ కోసం నిర్మాత,దర్శకుడు కన్నా ఎక్కువగా ఎదురుచూసేది వాళ్లే అని మర్చిపోకూడదు.

ఇంతకు ముందు రోజుల్లో బయిట..ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య యుద్దాలు జరగటం కామన్ అయ్యిపోయింది. అయితే హీరోలు ఫ్యాన్స్ అందరూ చూస్తేనే మంచి ఓపినింగ్స్, భాక్స్ లు బ్రద్దలు అయ్యే పరిస్దితి. అఖండ తో అటు బాలయ్య ఫ్యాన్స్..ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసారు. ఇద్దరూ అఖండను సపోర్ట్ చేసారు. అలాగే ఇప్పుడు పుష్పను సపోర్ట్ చేయబోతున్నారు. అదే విధంగా ఆర్ ఆర్ ఆర్ కు కూడా జరగబోతోందని వినికిడి. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. దాంతో ఖచ్చితంగా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సినిమాని సపోర్ట్ చేస్తారు. అందులో సందేహం లేదు. అయితే ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా ఓ ఎగ్రిమెంట్ కు వచ్చారని సమాచారం.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కు చెందిన ఫ్యాన్స్ అశోశియోషన్స్ కు చెందిన ముఖ్యులు కలిసి మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. రిలీజ్ అయ్యే థియోటర్స్ ని ఫ్యాన్స్ వారిగా పంచుకుంటున్నారు. ఒక్కో ధియోటర్ ఒక్కో హీరో ఫ్యాన్స్ పంచుకున్నట్లు సమాచారం. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న థియోటర్ దగ్గర రామ్ చరణా్ ఫ్యాన్స్ రచ్చ చేయరు. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్  కు అనుకున్న థియేటర్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేయరు. ఒక హీరో థియోటర్ దగ్గర మరో హీరో ఫ్యాన్స్ స్లోగన్స్ ఇవ్వటం, బ్యానర్స్ కట్టడం చేయరు. ఇలా నోటి మాటగా కాకుండా డివిజన్ వారిగా సైన్ చేసుకుని మరీ ఎగ్రిమెంట్ జరిగిందని సమాచారం. ఈ మేరకు హీరోల వైపు నుంచి ఆదేశాలు వచ్చాయని వినికిడి. ఇలా జరగటం టాలీవుడ్ చరిత్రలో తొలి సారి అంటున్నారు. ఏవైనా ఈ రూల్స్ విభేదించి గొడవలు జరిగితే అక్కడ ఆ హీరోకు చెందిన ఫ్యాన్స్ అశోశియోషన్స్ దే భాధ్యత తీసుకోబోతున్నారట.

Also read RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` దేశభక్తి సినిమా కాదా? షాకిచ్చిన రాజమౌళి.. అసలు స్టోరీ చెప్పేశాడుగా..

రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ...‘తారక్‌... చరణ్‌ ఇద్దరినీ కలిపి తీసిన తొలి సన్నివేశం బైక్‌పై వస్తున్నప్పటిది. ఆ సన్నివేశంలో వాళ్లు మాట్లాడుకున్న తీరు, సంభాషణలు చెప్పుకొన్న తీరు చూసి.... వీళ్లిద్దరి మధ్య స్నేహం బలంగా పండుతుందని అర్థమైంది. ఇది దేశభక్తి సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. ఈ కథా సందర్భం, ఎంచుకున్న పాత్రల వల్ల అంతర్లీనంగా దేశభక్తి  భాగమైంది. చిత్రాన్ని ఐదు భాషల్లో తీశాం. మిగతా భాషల్లో వాళ్లు డబ్‌ చేస్తున్నారు.మన హీరోలు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో డబ్బింగ్‌ చెప్పారు’’అన్నారు.

Also read Rajamouli: దటీజ్ రాజమౌళి.. వరల్డ్ టాప్ 50 దర్శకులలో రాజమౌళి, ఏకైక భారతీయుడు జక్కన్నే
 

Follow Us:
Download App:
  • android
  • ios