దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా సినిమాకి తన ఖ్యాతిని పెంచుకుంటూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నాడు. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా సినిమాకి తన ఖ్యాతిని పెంచుకుంటూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నాడు. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తెలుగువారందరికీ రాజమౌళి సత్తా ఏంటో తెలుసు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు జక్కన్న. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం రాజమౌళి ప్రతిభకు నివ్వెరపోయింది. 

ప్రస్తుతం Rajamouli ఆర్ఆర్ఆర్ తో మరోసారి యావత్ దేశాన్ని మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే RRR Trailer ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా రాజమౌళి మరో ఘనత సాధించారు. వరల్డ్ టాప్ 50 కూలెస్ట్ దర్శకుల జాబితాలో రాజమౌళి స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో రాజమౌళి 25వ స్థానం దక్కించుకోవడం విశేషం. 

ఈ జాబితాలో ఆస్కార్ విన్నింగ్ మూవీ 'పారాసైట్' దర్శకుడు బాంగ్ జూన్-హో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి ఒక్కరే. సెట్స్ లో రాజమౌళి తమని టార్చర్ పెడతారు అంటూ ఎన్టీఆర్, రాంచరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బ్లాస్టింగ్ పిక్స్.. కవ్వించే ఒంపుసొంపులతో అందాల జాతర

Also Read: Rajinikanth: రజినీకాంత్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 5 చిత్రాలు