త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమా కోసం ఎన్టీఆర్ ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాడు. మొదటిసారిగా త్రివిక్రమ్తో జత కడుతున్న తారక్.. తను గతంలో ఎన్నడూ కనిపించనంత ఫిట్ గా ఈ మూవీలో అభిమానులకు సర్ప్రైజ్ చేయాలని ప్రిపేర్ అయిపోతున్నాడు.ఇప్పటికే వర్కవుట్స్ చేస్తున్న ఎన్టీఆర్.. ఈ నెల 23 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అప్పటివరకు మాత్రమే కాదు.. సినిమా పూర్తయ్యే వరకూ ఫిట్నెస్ కంటిన్యూ చేయాల్సి ఉంది. అందుకే ముందుగా ఫిక్స్ చేసిన డైట్ ప్లాన్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నాడట. కండలు కరిగించడమే కాదు.. వాటిని మెయింటెయిన్ చేయడం కోసం చాలానే కష్టపడాల్సి ఉంది. ఆల్కహాల్ కు కూడా పూర్తిగా దూరంగా ఉండడమే కాదు.. నెలకు ఒక్కసారి మాత్రమే కోరుకున్న పుడ్ తీసుకునేందుకు అనుమతి లభిస్తుండదట.ఎగ్ వైట్స్.. చికెన్.. ఫ్రెష్ ఫ్రూట్స్.. వెజిటబుల్స్.. ఇది బ్రేక్ ఫాస్ట్. అలాగే స్నాక్స్ రూపంలో ఆల్మండ్స్.. వాల్నట్స్ మాత్రమే తీసుకుంటున్నాడట. రోస్టెడ్ చికెన్.. ఫ్రైడ్ మటన్.. ఫిష్ ను లంచ్ - డిన్నర్ లుగా తీసుకోవాల్సి ఉంటుందట. ఈ ఫుడ్ కూడా క్రమంగా తగ్గిపోతుందట. లాయిడ్ స్టీవెన్ కు ఈ ట్రైనింగ్ కోసం ఏకంగా 6 లక్షల రూపాయలు చెల్లించనున్నారట. గతంలో ఎన్నడూ చూడని తారక్ ను మనం చూడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.