Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమాలో నటించడంలేదన్న తారక్

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి
  • కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తాడని ప్రచారం
  • అందులో నిజం లేదన్న ఎన్టీఆర్
ntr not playing role in mahanati

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో... లెజండరీ నటి సావిత్రి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. సమంత, షాలిని పాండే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు లాంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పాలకొల్లులో జరుగుతోంది.

 

అయితే.. ఇది సావత్రి జీవిత కథ కనుక ఇందులో కచ్చితంగా సీనియర్ నటుడు ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని.. ఆ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తారక్ స్పందించారు. తాను ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు.

 

అసలు ఆ సినిమాలో నటించమని.. తనను ఇంత వరకు ఎవరూ అడగలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఒక వేళ సంప్రదిస్తే చేస్తాడా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios