యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ లో సిక్స్ ప్యాక్ లుక్ తో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా 
టీజర్ ను వదలనున్నారు.

అయితే ఎన్టీఆర్ టీజర్ వచ్చిన సరిగ్గా వారానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి ఆయన లుక్ ను అధికారికంగా విడుదల చేయనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయడానికి నిర్ణయించుకుంది చిత్రబృందం.

ఈ లుక్ కచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఒకే వారంలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల నుండి టీజర్, ఫస్ట్ లుక్ విడుదల కానుండడం అభిమానులకు మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ 'అరవింద సమేత' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాగా, చిరంజీవి 'సైరా' మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు 
రానుంది!