బాలకృష్ణ 118 సినిమా టైటిల్ ని 198 చేసినప్పుడే ఆయన గొంతులో ఎంత బాధ ఉందొ చాలా మందికి అర్థమైపోయింది. కళ్లెదుట భారీ వేదిక ముందు ఉన్న సినిమా టైటిల్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారంటే అది మాములు విషయం కాదు. తండ్రి పేరెత్తకుండా ఏ వేదికలో స్పీచ్ ను స్టార్ట్ చేయని బాలయ్య అసలు ఎన్టీఆర్ గురించే మాట్లాడకపోవడం షాకింగ్ అని చెప్పాలి. 

ఆయన అసలు బాధ ఏమిటో లేటెస్ట్ గా సినిమాకు వచ్చిన టోటల్ కలెక్షన్స్ లెక్కల గురించి తెలిస్తే అందరికి ఒక క్లారిటీ వస్తుంది.  ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు 5 కోట్ల కలెక్షన్స్ ను కూడా దాటలేదని తెలుస్తోంది. 50 కోట్ల సినిమా రెండు భాగాలకు కలిపి కనీసం 20 కోట్లను దాటాకపోవడం అంటే ఏ హీరోకైనా నిద్రపడుతుందా?

ఈ బాధను దిగమింగుకోవడం బాలయ్యతో అయ్యే పనేనా?. గతంలో ఎన్ని అపజయాలు వచ్చినా పట్టించుకోని బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ తో దారుణంగా దెబ్బ తినడంతో సైలెంట్ అయిపోయారు. ఇక సినిమాలను పక్కనపెట్టేసి ఎన్నికలపై ద్రుష్టి పెట్టారు. నెక్స్ట్ బాలకృష్ణ తనకు సింహా - లెజెండ్ సినిమాలతో హిట్టిచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. 

మహేష్ బాక్స్ ఆఫీస్ కెరీర్.. లాభనష్టాలు! okkatu to barath ane nenu