దసరా కానుకగా జైలవకుశ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు ఇప్పటికే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి నిమజ్జనం కారణంగా ఆడియో వేడుక అనుమతి రద్దు.. కానీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైలవకుశ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇప్పటికే నిర్మాత ప్రకటించారు. దసరా సీజన్ లో మూవీ రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పరంగా చాలా అడ్వాంటేజ్ వుంటుందనటంలో సందేహం లేదు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఆ సందర్భంగా నిమజ్జనం కార్యక్రమం, బక్రీద్ పండగలు వున్నందున పోలీసులు ఆడియో వేడుకకు అనుమతిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం.
ఇక అభిమానులను నిరాశపరచకుండా... ట్రైలర్ విడుదల కోసం ప్రత్యేకంగా బారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 10న ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతే కాక అప్పటికల్లా పాటలతోసహా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 21న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
