Asianet News TeluguAsianet News Telugu

జైలవకుశ కలెక్షన్స్ రికార్డు: బాక్సాఫీస్ వసూళ్లు

  • ఈ గురువారం భారీ అంచనాలతో రిలీజైన ఎన్టీఆర్ జైలవకుశ 
  • బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్న జైలవకుశ
  • తొలిరోజే యుఎస్ లో భారీ వసూళ్లు సాధించిన జైలవకుశ
ntr jai lavakusa first day collections record

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి ‘జై లవ కుశ’మూవీ నిరూపించింది. విమర్శకులకు కలెక్షన్స్ రూపంలో సమాధానమమిచ్చాడు ఎన్టీఆర్. తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చాలా బాగుందని, అంతకు మించి ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు.

 

దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద ‘జై లవ కుశ’ కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ.24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అటు యూఎస్ బాక్సాఫీసు వద్ద 560,699 డాలర్లు (సుమారు రూ.3.64 కోట్లు) రాబట్టింది. ఈ మేరకు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలిరోజే కలెక్షన్లు ఈ రేంజ్‌లో ఉంటే వారం రోజులు రూ.100 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ పండుతులు అంచనా వేస్తున్నారు.

 

ఎన్టీఆర్ గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 134 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది మూడో అత్యధిక వసూళ్ల రికార్డు. ఇప్పుడు ‘జై లవ కుశ’ దీన్ని దాటేస్తుందని అంటున్నారు. కాగా, ‘జై లవ కుశ’ సినిమాకి రూ.65 కోట్లు వరకు ఖర్చుపెట్టారు. కానీ రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.80 కోట్ల బిజినెస్ చేసేసింది. ఇప్పుడు తొలిరోజే హిట్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేస్తున్నాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios