ఐపీఎల్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఎన్టీఆర్

First Published 27, Mar 2018, 4:36 PM IST
NTR is brand Ambassador for star tv
Highlights
పీక్స్ లో క్రేజ్ ఎన్టీఆర్ క్రేజ్

 బిగ్ బాస్ షోతో టివి ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ఈ తారకరాముడు ఈ సారి మాత్రం ఆ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదు.టాలీవుడ్ లో గత కొంత కాలంగా అందరికంటే వినూత్నంగా తన ఇమేజ్ ను పెంచుకుంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. గత కొంత కాలంగా అందరికంటే వినూత్నంగా తన ఇమేజ్ ను పెంచుకుంటున్న హీరో ఎన్టీఆర్ . తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ - రాజమౌళి ప్రాజెక్టుల కోసమే ఆలోచిస్తున్నాడు. 

అయితే ఎన్టీఆర్ బుల్లితెర అభిమానులను చాలా మిస్ అవుతున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మరో విదంగా రావడానికి మనోడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ టివి ఈ ఏడాది స్పోర్ట్స్ ఈవెంట్స్ తో భారీ స్థాయిలో బిజినెస్ ను ప్లాన్ చేసుకుంది. ఐపీఎల్ - ప్రో కబడ్డీ లీగ్ లకు ఆదరణ చాలా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే రెండింటికి సంబంధించిన ప్రమోషన్స్ లలో తెలుగు సైడ్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ ని వాడనున్నారని తెలుస్తోంది. స్టార్ మా త్వరలో ఎన్టీఆర్ తో ప్రోమోస్ రెడీ చేయడానికి రెడీ అవుతోంది. అంతా పూర్తయిన తరువాత టెలికాస్ట్ చేస్తారట. 

ఈ రెండు వర్కౌట్ అయితే తారక్ రేంజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ అంటే మనవాళ్లకు చాలా పిచ్చి. ఆ అభిమానులను తారక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి దక్కించుకున్నాడు అంటే చాలు ఎన్టీఆర్ హోదా ఇంకా పెరుగుతుంది. ఇక ఐపీఎల్ వచ్చే నెల ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ కానుంది. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.

loader