Asianet News TeluguAsianet News Telugu

EMK: కోటి గెలుచుకున్న రాజా రవీంద్ర కి ఎంత ఇస్తారో తెలుసా?.. మరీ అన్ని లక్షలు కోతా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా కొనసాగుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. మొదటిసారి ఈ షోలో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకోవడం జరిగింది. మరి కోటి గెలుచుకున్న సదరు కంటెస్టెంట్ కి పూర్తి కోటి రూపాయలు దక్కవు. నిబంధన ప్రకారం అతడికి దక్కే మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

ntr  evaru meelo koteeswarulu one crore winner in reality gets almost half of the the amount
Author
Hyderabad, First Published Nov 17, 2021, 7:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎవరు మీలో కోటీశ్వరుడు (Evaru meelo koteeswarulu) షో చివరి దశకు చేరుకుంది. మరికొన్ని ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉండగా ఓ అసామాన్య సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి రాజా రవీంద్ర ఈ షోలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. కోటి రూపాయలు గెలుచుకున్నాడు. హోస్ట్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించడంతో పాటు కోటి గెలుచుకున్న మొట్టమొదటి విజేతగా రాజా రవీంద్రను పొగిడారు. 


కొత్తగూడెం కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర(Raja ravindra) స్పోర్ట్స్ మెన్ కూడాను. ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అతడు ప్రొఫెషనల్. ఈ విభాగంలో అనేక నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొని, బహుమతులు సాధించారు. ఇక దేశానికి ఒలింపిక్ మెడల్ సాధించి పెట్టడమే తన లక్ష్యం అని, దాని కోసం గెలుచుకున్న ప్రైజ్ మనీ ఉపయోగిస్తానని రాజారవీంద్ర షోలో తెలియజేశారు. 


అయితే కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్రకు నిబంధనల ప్రకారం దక్కేది మాత్రం తక్కువే. ఆయన గెలుచుకున్న పూర్తి అమౌంట్ కోటి రూపాయలు ఆయనకు నిర్వాహకులు ఇవ్వరు. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎవరైనా ఓ టీవీ షోలో రూ. 10000 మించి ప్రైజ్ మనీ గెలుచుకుంటే 31.2 శాతం టాక్స్ చెల్లించాలి. దీని ప్రకారం రాజా రవీంద్రకు కేవలం రూ. 68.8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. టాక్స్ మినహాయించుకొని, మిగిలిన అమౌంట్ విన్నర్ కి ఇస్తారు. 
పేరుకు గెలుచుకుంది కోటి రూపాయలు అయినా దక్కేది మాత్రం దాదాపు అందులో సగం అన్నమాట. 

కాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో ఏమంత గొప్ప టీఆర్పీ రాబట్టలేకపోతుంది. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఆ షోని సూపర్ సక్సెస్ చేశారు. ఎవరు మీలో కోటీశ్వరులు విషయంలో ఆయన మ్యాజిక్ పని చేయడం లేదు. మంచి టీఆర్పీ వస్తున్నప్పటికీ... నిర్వాహకులు ఆశించిన స్థాయిలో మాత్రం షో సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ వలన షో భారీ విజయం సాధిస్తుంది అనుకుంటే... అది జరగలేదు.  

Also read పోలీస్ దెబ్బ అదుర్స్ కదా.. ఎన్టీఆర్ EMK షోలో కోటి గెలుచుకున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే
మరోవైపు ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ (RRR moive) విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, మరో స్టార్ హీరో రామ్ చరణ్ (Ram charan)అల్లూరి సీతారామరాజు రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రోమోలు ఊహకు మించి ఉండగా, సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. ఇక 2022 సంక్రాంతి బరిలో ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ పోటీపడనున్నాయి. 

Also read NTR: సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చిన ఎన్టీఆర్.. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారి!

Follow Us:
Download App:
  • android
  • ios