Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఔదార్యం.. చావుబతుకుల్లో ఉన్న అభిమానికి భరోసా!

కొప్పాడి మురళి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. మురళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైయ్యాడు. చికిత్స తీసుకుంటున్న మురళి జూనియర్ NTR ను చూడాలని ఉందని కోరుకున్నాడు.

ntr fulfills die hard fans wish spoke to him over video call
Author
Hyderabad, First Published Oct 7, 2021, 11:19 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మంచి మనసు చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న అభిమానికి ఆయన ధైర్యం చెప్పారు. సోషల్ మీడియా విప్లవం తరువాత, ఎంత పెద్దవారికైనా సామాన్యులు తమ సందేశం సులభంగా చేరవేస్తున్నారు. అదే క్రమంలో సినిమా స్టార్స్  డై హార్డ్ ఫ్యాన్స్ సైతం తమ మనోభావాలను, కోరికలను సోషల్ మీడియా ద్వారా స్టార్స్ కి చేరవేస్తున్నారు. ఆపదలో ఉన్న వీరాభిమానులు రి కోరికలు తీర్చడం స్టార్స్ కి ఆనవాయితీగా మారింది. తాజాగా ఎన్టీఆర్ ఆసుపత్రి బెడ్ పై విషమ పరిస్థితిలో ఉన్న తన అభిమానితో మాట్లాడారు. 


విషయంలోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం.. గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. మురళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైయ్యాడు. అతని రెండు కిడ్నీలు పాడైపోగా, విషమ స్థితికి చేరుకున్నాడు. చికిత్స తీసుకుంటున్న మురళి జూనియర్ NTR ను చూడాలని ఉందని డాక్టర్‏కు పేపర్ రాసి ఇచ్చాడు. డాక్టర్స్ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి ఈ విషయం చేరవేశారు. 

Also read ఎన్టీఆర్ మీకు ఓటు వేయలేను అన్నారు... జీవిత రాజశేఖర్ సంచలన కామెంట్స్


బెడ్ పై ఉన్న మురళితో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు. నీకు ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. అలాగే త్వరలో మనం కలుద్దామని, భరోసా ఇచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్, మురళి ప్రస్తుత కండీషన్ గురించి డాక్టర్స్ ని అడిగితెలుసుకున్నట్లు సమాచారం.  నేను ఉన్నాను నీకేమి కాదని, అభిమానికి ఎన్టీఆర్ ధైర్యం చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఎన్టీఆర్ గొప్ప మనసును, అందరూ కీర్తిస్తున్నారు. 


ప్రస్తుతం ఎన్టీఆర్ RRR movie పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు జెమినీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం హోస్ట్ గా ఎన్టీఆర్ ప్రతిరోజు అభిమానులను అలరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios