ఎన్టీఆర్ మీకు ఓటు వేయలేను అన్నారు... జీవిత రాజశేఖర్ సంచలన కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) మా ఎన్నికల్లో(MAA elections) పాల్గొనను అన్నారని జీవిత రాజశేఖర్ ఆసక్తికర విషయం బయటపెట్టారు.జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రెటరీ పదవికి పోటీపడుతున్నారు.
టాలీవుడ్ లో మా ఎన్నికలు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రధాన కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. నేడు ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం మంచు విష్ణు వర్గం పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మా ఎన్నికల్లో పాల్గొనను అన్నారని జీవిత రాజశేఖర్ ఆసక్తికర విషయం బయటపెట్టారు. తాజాగా ఓ పార్టీలో ఎన్టీఆర్ ని కలిశానని, తనకు ఓటు వేయాలని కోరినట్లు జీవితా రాజశేఖర్ తెలిపారు. అయితే మా ఎలక్షన్స్ ఎన్నికలలో తాను ఓటు వేయనని ఎన్టీఆర్ అన్నారట. అలాగే మా ఎన్నికల విషయంలో జరుగుతున్న పరిణామాలు, వివాదాలు తనను చాలా నిరాశపరిచాయని ఎన్టీఆర్ తన అసహనాని జీవిత రాజశేఖర్ తో వెల్లడించారట. మీకు ఓటు వేయడం కుదరదని, సున్నితంగా ఎన్టీఆర్ జీవిత రాజశేఖర్ అభ్యర్ధనను తోసిపుచ్చారట.
Related పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది.. విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు
కాగా జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రెటరీ పదవికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై జీవిత కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నందమూరి కుటుంబం నుండి బాలకృష్ణ మంచు విష్ణుకు తన మద్దతు తెలియజేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మెగా హీరోల సప్పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే.