మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. కారణం విజయ్ దేవరకొండ..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 27, Aug 2018, 12:32 PM IST
ntr fans negative comments on mahesh babu
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారాడనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఇతర హీరోల సినిమాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టడం వంటివి చేస్తూ అందరికి అభిమాన హీరోగా మారుతున్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారాడనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఇతర హీరోల సినిమాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టడం వంటివి చేస్తూ అందరికి అభిమాన హీరోగా మారుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మహేష్ ఎంతో సన్నిహితంగా మెలుగుతారనే సంగతి తెలిసిందే. ముగ్గురూ కలిసి పార్టీలో ఫోటోలు దిగడం వాటిని అభిమానులను పంచడం వంటివి చేస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అభిమానుల మధ్య కూడా సఖ్యత మెలగాలంటూ సందేశాలు ఇస్తున్నారు.

అప్పటివరకు సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగేది. కానీ ఈ మధ్య కాలంలో అది బాగా తగ్గిందనే చెప్పాలి. మళ్లీ ఇన్నాళ్ల తరువాత విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ కారణంగా మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల విజయ్ 'మహర్షి' సినిమా సెట్స్ కి వెళ్లి అక్కడ మహేష్ తో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.

దీనికి మహేష్ వెంటనే రిప్లై ఇస్తూ విజయ్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టాడు. అంతే.. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మహేష్ పుట్టినరోజు నాడు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా. దానికి స్పందించని మహేష్.. విజయ్ ట్యాగ్ కూడా చేయకపోయినా వెంటనే స్పందించారంటూ మహేష్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

గీతాఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ సినిమా..?

'నీ టైమ్ నడుస్తోంది..' విజయ్ దేవరకొండపై మహేష్ కామెంట్!

loader