బాబి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా జై లవ కుశ మార్కెట్ లోకి ఆడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఆడియో వేడుక‌లో ఉద్వేగంగా మాట్లాడిన యంగ్ టైగ‌ర్
బాబి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా జై లవ కుశ.సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఇక నిన్న మార్కెట్ లోకి డైర్కెట్ గా ఆడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా ఆడియో రిలీజ్ చిత్రయూనిట్ సమక్షంలో జరుపుకున్నారు. సినిమా హిట్ కోసం కన్నా అన్నదమ్ములం ఇద్దరం కలిసి ఓ మంచి సినిమా చేయాలని అనుకున్నామని అన్నారు.
నాన్నకు కానుకగా సెప్టెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా సరే ఎందుకో అది కుదరలేదని. కాని 2 న వచ్చిన 21న వచ్చినా ఇది ఖచ్చితంగా నాన్నకు కానుకగా సినిమా ఇదని అన్నారు ఎన్.టి.ఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా తీయాలనే కన్ ఫ్యూజన్ ఉండేదని.. ట్రెండ్ ఫాలో అవ్వాలా మనసుకి నచ్చిన కథ చేయాలా అని కాస్త గ్యాప్ తీసుకున్నానని అన్నారు ఎన్.టి.ఆర్.
ఇక బాబి ఈ కథ చెప్పడం తనకు నచ్చడం జరిగిందని. మనసుకి నచ్చిన సినిమాగా ఇది కచ్చితంగా మీ అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 10న జరుపుకోనున్నారట. ఇక అదే రోజు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
దసరా బరిలో దుమ్ముదులిపేసేందుకు వస్తున్న తారక్ ఆడియో రిలీజ్ వేడుకలో తను మాట్లాడిన విధానం చూస్తుంటే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అన్నట్టే తెలుస్తుంది. ఇక హరికృష్ణ కూడా బిడ్డలిద్దరు చేసిన ఈ సినిమా అభిమానుల హృదయాలను గెలుచుకోవాలని ఆకాంక్షించారు.
