ఎన్టీఆర్ కొత్త బ్రాండ్ 'సెలెక్ట్' చేస్తారా?

First Published 12, Jul 2018, 4:26 PM IST
ntr brand ambassador for select mobile store
Highlights

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. నవరత్న ఆయిల్ నుండి ఐపిఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు 'సెలెక్ట్' మొబైల్స్ ప్రచారం కోసం యాడ్ లో పాల్గొన్నట్లు సమాచారం

సెలబ్రిటీలు బ్రాండింగ్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. ఒక కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లలో రెమ్యునరేషన్ అందుకునే తారలు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో కూడా మన హీరో, హీరోయిన్లు బ్రాండింగ్ పై మక్కువ చూపుతుంటారు. మహేష్ బాబు, అఖిల్, నాగచైతన్య, వెంకటేష్ ఇలా చాలా మంది బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా హ్యాపీ మొబైల్స్ కు బ్రాండింగ్ చేయడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. నవరత్న ఆయిల్ నుండి ఐపిఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు 'సెలెక్ట్' మొబైల్స్ ప్రచారం కోసం యాడ్ లో పాల్గొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఈ నెల 13న రానుందని తెలుస్తోంది.

దీనికోసం తారక్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడని సమాచారం. మరోపక్క ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ రంగంలోకి దిగే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నిర్మించే ప్లాన్ చేస్తున్నాట్లు సమాచారం. మొత్తానికి హీరోగా, బ్రాండ్ అంబాసిడర్ గా బిజీగా గడుపుతోన్న తారక్ ఇప్పుడు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు!

loader