తెలుగు బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్న ఎన్టీఆర్ జులై 16 నుంచి తెలుగు లోగిళ్లలో బిగ్ బాస్ షో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసిన ప్రోమోస్
తెలుగు టెలివిజన్ మార్కెట్ జులై 16 నుంచి మరో అడుగు ముందుకేసి తెలుగు బుల్లితెర స్థాయిని మరొక మెట్టు ఎక్కించబోతోంది. స్టార్ మా టీవి ప్రారంభించనున్న బిగ్ బాస్ షో జులై 16 నుంచి తెలుగు లోగిళ్లను పలకరించనుంది. ఈ షోలో.. ఎన్టీఆర్ త1లిసారిగా బుల్లితెర ఆరంగేట్రం చేయనున్నారు.
ఈ షోలో 12 మంది సెలెబ్రిటీలు పాల్గొంటుండగా... 70 రోజులపాటు వీరిని బిగ్ బాస్ హౌజ్ లో పెట్టి చుట్టూ 60 కెమెరాలు అమర్చనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టార్ మాటీవీ ముమ్మర కసరత్తులు చేసింది. దాదాపు 100 మంది సెలెబ్రిటీలను సంప్రదించిన మాటీవీ.. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందిందని తెలుస్తోంది. వీరిలో 12 మందిని ఎంపిక చేసి ప్రేక్షకులకు మరింత ఆకట్టుకునే వినోదం అందిస్తామని ఛానెల్ స్పష్టం చేసింది.
కాగా.. బిగ్ బాస్ షోను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ చేసింది. వారం రోజుల్లోనే 55మిలియన్ ల మంది ప్రేక్షకులను రీచ్ అయిందని, ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ సోషల్ మీడియాలో... దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్ది వ్యూస్, షేర్స్ తో సంచలనం సృష్టించింది. మరోవైపు తెలుగులో ఈ షో మొట్టమొదటి అత్యధిక బడ్జట్ షోగా నిలవగా... పది వేల చదరపు అడుగుల భారీ సెట్టింగ్ లో.. ప్రతి క్షణం 750 మంది సిబ్బంది పనిచేస్తున్న షోగా బిగ్ బాస్ నిలుస్తోంది.
ఇక ఈ షో ప్రత్యేకత ఏంటంటే.. దర్శకుడు కట్ అనే పదం వాడని ఏకైక షో బిగ్ బాస్. ఇక 60 కెమెరాలు నిత్యం నడుస్తూనే ఉండటం విశేషం. బిగ్ బాస్ మెగా ఎపిసోడ్ జులై16న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా వుందని, తెలుగు టెలివిజన్ రంగంలో ఓ పెను సంచలనం కాబోతోందని ఎన్టీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు.
