ఎన్టీఆర్ సినిమా టైటిల్ ఇదే!

ntr and trivikram movie title revealed
Highlights

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'అసమాన్యుడు','అష్టలక్ష్మి టు అమ్ములు','రాఘవ' ఇలా చాలా పేర్లు వినిపించాయి. తన సినిమాలకు టైటిల్ పెట్టే విషయంలో త్రివిక్రమ్ ట్రయిల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో అవుతుంటాడు. ముందుగా కొన్ని పేర్లు జనాల్లోకి వదిలి దేనికి మంచి రెస్పాన్స్ వస్తుందో దాన్ని టైటిల్ గా ఫైనల్ చేస్తుంటాడు.

ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా అదే చేశాడు. ఈ మూడు టైటిల్స్ లో ఏదోకటి ఫైనల్ చేస్తాడని అనుకున్నారు. కానీ తాజాగా ఎన్టీఆర్ సినిమా ''అరవింద సమేత రాఘవ'' అనే పేరును టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఇదే టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది చిత్రబృందం. టైటిల్ ను బట్టి సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కు కూడా సమాన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. సినిమా చాలా వరకు ఆమె చుట్టూనే తిరుగుతుందని టాక్. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. 

loader