కళ్యాణ్ రామ్ పుట్టినరోజు.. కొడుకుతో తారక్ హడావిడి

ntr and abhay ram at kalyan ram birthday celebrations
Highlights

కళ్యాణ్ రామ్ పుట్టినరోజుని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్.. వేడుకల్లో తారక్ తో పాటు పాల్గొన్న అభయ్ రామ్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫోటోలు 

హీరో కళ్యాణ్ రామ్ గురువారం తన 40వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా NKR16 సినిమా షూటింగ్ లో చిత్రబృందం కళ్యాణ్ రామ్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ రామ్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఎన్టీఆర్ తన అన్నయ్య పుట్టినరోజుకి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.

ఆయనతో కేక్ కట్ చేయించి సందడి చేశారు. ఈ వేడుకలలో ఎన్టీఆర్ తో పాటు తన పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే..కళ్యాణ్ రామ్.. కె.వి.గుహన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా కనిపించనున్నారు.ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. 

loader