చల్ మోహన్ రంగలో తమని అవమానించారంటూ ఎన్నారైల ఆగ్రహం

First Published 5, Apr 2018, 6:25 PM IST
nris fire on chal mohanaranga comedy
Highlights
చల్ మోహన్ రంగలో తమని అవమానించారంటూ ఎన్నారైల ఆగ్రహం

లై మూవీ తర్వాత నితిన్, మేఘా కాష్ లు జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ చల్ మోహన రంగ. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఛల్ మోహన్ రంగ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో నితిన్ ఓ డాలర్ డ్రీమ్స్ వుండే మధ్యతరగతి కుర్రాడిగా నటించాడు. మేఘా ఆకాష్ నితిన్ ప్రేయసి పాత్రలో నటించింది.

 

అయితే ప్రేమ సన్నివేశాలకంటే.. కామెడీతోనే ఎక్కువగా లాగేసిన దర్శకుడు కృష్ణచైతన్య ఈ చిత్రంలోని ఓ సీన్ లో లిబర్టీ స్టాచ్యూ వద్ద హీరో, కమెడియన్ మధ్య ఓ సీన్ చిత్రీకరించాడు. ఈ సీన్ లో ఆ స్టాచ్యూనుద్దేశించి హీరో... ఈవిడ ఇక్కడేం చేస్తుంటుంది అంటూ.. ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానందా ఆమె పల్లీలమ్ముకుంటుంది. నీకెందుకు అంటాడు. కానీ లిబర్టీ స్టాచ్యూకుండే చరిత్ర తెలియక ఇలా జోకులు పేలారా లేక.. కావాలనే చేశారా అని ఎన్నారైలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది చూడటానికి కామెడీగా వున్నా ఒక దేశ చరిత్రను అవమానపరచడమేనని మండిపడుతున్నారు.

loader