Asianet News TeluguAsianet News Telugu

గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు క్లాస్ పీకిన ఎన్నారై

  • ప్రవీణ్ సత్తారు కామెంట్స్ పై ఎన్నారై ఆగ్రహం
  • బహిరంగ లేఖ రాసి క్లాస్ పీకిన ఎన్నారై నవీన్ రెడ్డి
  • ఎన్నారైలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
NRI vents ire on tollywood director praveen sattaru

రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ మూవీకి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు ఆ మూవీ రిలీజ్ సందర్భంగా చేసిన కామెంట్స్ తో ఇప్పుడు ఎన్నారై లోకంలో రచ్చ రచ్చ జరుగుతోంది. అమెరికాలో వుండే తెలుగువాళ్లు సినిమాలను పైరసీ చేసి చూస్తారంటూ గతంలో సత్తారు కామెంట్ చేశారు. ఓ ఛానెల్ డిబేట్ సందర్భంగా సత్తారు చేసిన కామెంట్లపై ఓ తెలుగు ఎన్నారై నవీన్ రెడ్డి(ఫిలడెల్ఫియా) చాలా ఘాటుగా స్పందించారు.

అసలు తెలుగు సినిమాల వసూళ్లు అమెరికాలో బాలీవుడ్ సినిమాల వసూళ్ల కంటే ఎక్కువ అన్న సంగతి సత్తారు గుర్తించాలని నవీన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఇటీవల బాహుబలి 130కోట్లు, ఖైదీ నెంబర్ 150 18 కోట్లు, అలాగే పవన్ , మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలు 12కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన విషయం సత్తారు గుర్తు పెట్టుకోవాలని ఎన్నారై నవీన్ రెడ్డి పేర్కొన్నారు.

చిన్న బడ్జెట్ సినిమాలైన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఫిదా లాంటి సినిమాలకు కూడా ఎన్నారైలు మంచి కలెక్షన్స్ ఇచ్చారని, తెలుగు ఎన్నారైలంతా సినిమాలు టికెట్ కొనుక్కుని చూసినందునే ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయని ప్రవీణ్ సత్తారు గుర్తించాలన్నారు నవీన్ రెడ్డి. ఎన్నారైలు సినిమాలు చూడకుంటే అంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు.

 

చందమామ కథలు తర్వాత చాలాకాలానికి పిఎస్వి గరుడవేగతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు తన దర్శకత్వ ప్రతిభ ఏంటో గుర్తెరగాలన్నారు. తిరిగి అమెరికాలో ఐటీ జాబ్ చేసుకుంటే మంచిదని సూచించారు. గుంటూరు టాకీస్ లాంటి చీప్ సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు ఎన్నారైల గురించి లేనిపోని అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని నవీన్ రెడ్డి సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios