మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై సన్నిహితుల మాట!

No reason to worry about maniratnam
Highlights

ప్రస్తుతానికి ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలు విని కంగారు పడొద్దని చెబుతున్నారు

దర్శక దిగ్గజం మణిరత్నం గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని కొద్ది గంటల క్రితం వార్తలు హల్చల్ చేశాయి. దాదాపు అన్ని మీడియా వర్గాలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి.

ఇదివరకే ఆయనకు గుండెపోటు రావడం, ఇది రెండోసారి కావడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే ప్రస్తుతానికి ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలు విని కంగారు పడొద్దని చెబుతున్నారు. ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం తమిళంలో 'చెక్క చీవంత వాణం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అతిథి రావ్ హైదరి వంటి తారలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదే సినిమా 'నవాబ్' అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది. 

loader