బిగ్ బాస్2 లో శ్రీరెడ్డి లేదట!

no entry to srireddy in big boss2
Highlights

కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న నటి శ్రీరెడ్డి తరచూ 

కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న నటి శ్రీరెడ్డి తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. గత కొన్నిరోజులుగా ఆమెను బిగ్ బాస్ 2 లో కంటెస్టంట్ గా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు ఈమె ఎంట్రీ ఖాయమని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం శ్రీరెడ్డి బిగ్ బాస్ హౌస్ లో కనిపించదని తెలుస్తోంది. ఈ షో ద్వారా తన పాపులారిటీ మరింత పెంచుకోవచ్చనే ఆలోచనతో శ్రీరెడ్డి స్వయంగా హౌస్ లో చోటు కోసం ప్రయత్నించిందట. కానీ ఆమెకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ షో మొత్తాన్ని ఆర్గనైజ్ చేసే ఓ ప్రైవేట్ కార్పోరేట్ కంపనీ శ్రీరెడ్డి విషయంలో సానుకూలంగా స్పందించకపోవడంతో ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

సో.. బిగ్ బాస్ హౌస్ లో శ్రీరెడ్డి కనిపించదన్నమాట. మరి కంటెస్టంట్స్ పేర్లు వినిపిస్తోన్న మిగిలిన వారైనా ఈ షోలో ఉన్నారో లేదో కొన్ని రోజుల్లో తెలియనుంది!

loader