అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది. మొన్నటిదాకా మన మధ్యే ఉంది ఇంత అకస్మాత్తుగా ఆమె మరణించడం ఎవరు సహించలేకపోతున్నారు. కానీ ఇంత సడన్ గా ఆమె ఎందుకు మరణించినట్టు? ఆమెది సహజ మరణమేనా? ఇందులో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా అంటూ సందేహాలు వినిపిస్తున్నాయి. 

నిన్ననే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపడం జరిగింది. రిపోర్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా ఇవాళ కాసేపటి క్రితం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఆమె మరణం హార్ట్ ఎటాక్ వల్లనే సంభవించింది అని నిరూపితమైంది. రిపోర్ట్స్ రావడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ లో చాలా రుమర్లకు తావిచ్చినట్టైంది. కానీ ఒక వ్యక్తి హాస్పిటల్ లో చనిపోతేనే రిపోర్ట్స్ త్వరగా బయటకి వస్తాయి బయట చనిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి - డెత్ రిజిస్టర్ చేసి - అన్నిటిని పరీక్షించి రిపోర్ట్స్ తయారీకి కొంత ఎక్కువ సమయం పడుతుంది అని ఒక గల్ఫ్ జర్నలిస్ట్ చెప్పారు. 

బాడీ ని మోర్చరీ లో పెట్టి - ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తయారు చేసి - ఆటోప్సీ రిపోర్ట్ ను పోలీసులకు అందచేసి క్లియరెన్స్ పొందటం జరిగింది. ఆ తరువాత వీసా చెక్ చేసి - ఆ పాస్ పోర్ట్ క్యాన్సల్ చేసి డెత్ సర్టిఫికెట్ అలాగే నో ఓబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇది మాములుగా జరిగే ప్రొసీజర్. శ్రీదేవి మరణం తరువాత కూడా ఈ ప్రొసీజర్ కే చాలా సమయం పట్టింది తప్ప ఆమె చావులో అనుమానాస్పదంగా ఏది లేదు అంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం తేలింది.