లెస్బియన్ గా నిత్యా మీనన్

First Published 3, Jan 2018, 8:17 PM IST
nitya menon doing a lesbian role
Highlights
  • దక్షిణాది తారల్లో మంచి గుర్తింపు పొందిన నిత్యా మీనన్
  • స్టోరీ నచ్చందే కథకు ఓకే చెప్పని నిత్యా మీనన్
  • తాజాగా ఓ లెస్బియన్ రోల్ కు ఓకే చెప్పిన నిత్య 

 

దక్షిణాది తారల్లో త్రిష, నయనతార, అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ వెండితెరకు పరిచయం అయ్యి చాలా ఏళ్లయినా.. హీరోలతో ఇప్పటికి సినిమాలను చేస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే వీరు వచ్చిన టైమ్ కి కొంచెం దగ్గరగా నిత్యా మీనన్ కూడా వచ్చింది.

 

2006వ సంవత్సరం నుంచి నిత్య లీడ్ యాక్టర్ గా రాణిస్తోంది. అయితే సీనియర్ హీరోయిన్స్ స్థాయిలో ఎక్కువగా స్టార్ హీరోలతో ఈ బ్యూటీ వర్క్ చేయలేదు గాని ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్స్ ని మాత్రమే చేసింది. అంతే కాకుండా ఎన్నడు ఆఫర్స్ లేకుండా కనిపించలేదు. ఇప్పటివరకు సినిమాలను చేస్తూనే వస్తోంది. అంతే కాకుండా ఆమె పాత్రలు కూడా చాలా డిఫెరెంట్ గా ఎంచుకుంటూ వస్తోంది. ఇక రీసెంట్ గా మరొక విభిన్నమైన పాత్రను ఎంచుకోవడానికి సిద్ధమైంది.

 

నిత్యాకు స్టోరీకి తగ్గట్టు పాత్ర నచ్చితే చాలు ఏ మాత్రం నో చెప్పదు. అయితే ఎవరు ఊహించని ఒక పాత్రకు అమ్మడు ఒకే చేసిందట. తరువాత సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ లో కనిపించనుందట. ఆ సినిమాలో మరో తెలుగు హీరోయిన్ కూడా అదే క్యారెక్టర్ చేయనుందట. దీంతో ఇద్దరి మధ్య లిప్ లాక్స్ శృంగారానికి సంబందించిన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే గే - లెస్బియన్ సినిమాలను తెరకెక్కించవద్దని సుప్రీమ్ కోర్టు గతంలో నిషేధం విధించింది. మరి ఆ సినిమాకు సెన్సార్ అందుతుందో లేదో చూడాలి.

loader