శ్రీనివాస కళ్యాణం.. ట్విట్టర్ రివ్యూ

nitin nd rashikanna starrer srinivasa kalyanam movie twitter review
Highlights

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓవర్సీస్‌లో ముందుగానే రిలీజైంది. ఈ చిత్రం గురించి చాలా మంది పాజిటివ్‌గా స్పందించగా.. కొందరు మాత్రం యావరేజ్ అంటూ ట్వీట్లు చేశారు

పెళ్లి గొప్పదనాన్ని వివరిస్తూ.. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నితిన్ హీరోగా, రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వహించడం, దిల్ రాజు-నితిన్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. భారీ తారాగణంతో చిత్రీకరించిన ఈ సినిమా పాటలు, ట్రైలర్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన రావడంతో.. మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. 

ఇప్పటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. చిత్రాన్ని వీక్షించిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి వారి ట్వీట్ల ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓవర్సీస్‌లో ముందుగానే రిలీజైంది. ఈ చిత్రం గురించి చాలా మంది పాజిటివ్‌గా స్పందించగా.. కొందరు మాత్రం యావరేజ్ అంటూ ట్వీట్లు చేశారు. ఫస్టాఫ్ ఓకే అని, సెకండాఫ్ బాగుందని చెబుతున్నారు. 

ఓవరాల్‌గా ఇదో ఫీల్ గుడ్ మూవీ అని, సాంగ్స్ బాగున్నాయని టాక్. భారీ తారాగణం ఆకట్టుకుంటుందని, డైలాగులు బాగున్నాయని తెలుస్తోంది.ఓవరాల్ గా సినిమా బాగుందని పలువురు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పూర్తి రివ్యూ తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.

loader