ఈ శుక్ర ారం రిలీజ్ కాబోతోన్న నితిన్ లై లై చిత్రానికి సెన్సార్ టాక్ పాజిటివ్ అర్జున్ యాక్షన్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం
తెలుగు సినిమా అభిమానులకు ఈ ఆగస్ట్ 11 పెద్ద కన్ఫ్యూజన్ డేట్ గా మారింది. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మూడు సినిమాలు టాప్ కాస్ట్ అండ్ క్రూతో వస్తుండటంతో దేనికి ఓటేయాలో అర్థం కాక కాస్త కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. అయితే వీటిలో లై చిత్రం కూడా వుంది. ఈ చిత్రం ప్రత్యేకత చాలానే ఉందని సెన్సార్ రివ్యూను బట్టి తెలుస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి మొదటి చిత్రం అందాల రాక్షసి ప్లాప్ అయినా క్రిటిక్ నుంచి ప్రశంసలు పొందింది. రెండో సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సూపర్ హిట్ అవ్వడమే కాక నానీ కెరీర్ లో ఒక గుర్తుండిపోయే సినిమాగా మారింది.
ఇప్పుడు లై అంటూ వస్తున్న హను నితిన్ ని చాలా కొత్త లుక్ తో ఫుల్ గడ్డం తో చూపించాడు. నితిన్ మేక్ ఓవర్ - విలన్ గా అర్జున్ లుక్స్ - ట్రైలర్ లో డైలాగులూ ఇవన్నీ చూసి చెప్పేయచ్చు హనూ ఈ చిత్రాన్ని ఎంత డిఫరెంట్ గా మలిచాడు అనేది. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ అందింది. ఈ సినిమా విషయం లో మనకి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ట్రైలర్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా సాగుతుంది అంటున్నారు. అబద్ధాల మీద మాత్రమే బతకగలం అని చిన్నతనం నుంచే మైండ్ ని ఫిక్స్ చేసుకున్న ఒక అబ్బాయి జీవితం మొత్తం అబద్ధాలతో నింపేసుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయిని కూడా అలాగే డీల్ చేస్తాడు ఇతగాడు. అనాధగా పెరిగి లైఫ్ మీద పెద్దగా ఫోకస్ లేని ఇతను ఆ అమ్మాయి కారణంగా ఒక ఇబ్బంది లో ఇరుక్కుని ఇంటర్వెల్ లో తానేంటో.. అతని కుటుంబం ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్ లు, థ్రిల్లింగ్ గా సాగే సీక్వెన్స్ లతో సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది అని టాక్. క్లైమాక్స్ కాస్త సాగిందని తెలుస్తోంది. యాక్షన్ కింగ్ ఆర్జున్ నటన బాగుందనీ ఈ సినిమా తరవాత అతనికి విలన్ గా తెలుగులో చాలా ఆఫర్స్ వస్తాయని అంటున్నారు. మొత్తానికి మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ అయ్యేలా సినిమా ఉంటుందని అంటున్నారు.
