'సావిత్రి'గా నేను నటించి ఉంటే బాగుండేది!

nithya menen on mahanati savitri
Highlights

అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్

అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఊహించిన దానికంటే మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంటోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిందని ఆమె తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరనేంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.

నిజానికి కీర్తి కంటే ముందు ఈ పాత్ర కోసం నటి నిత్యామీనన్ ను సంప్రదించింది చిత్రబృందం. నిత్యాకు కూడా నటించడం ఇష్టమైనప్పటికీ ఎందుకో వారి కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే తాజాగా సావిత్రి పాత్రలో నేను నటించి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది నిత్యా.

''నేను ఇండస్ట్రీకు వచ్చినప్పుడు 'అలా మొదలైంది' సినిమా నుండి అందరూ సావిత్రి గారితో పోల్చేవారు. ఆమె పాత్రలో నేను నటించడం అనేది నాకు గొప్ప విషయం. కానీ కొన్ని కొన్ని సార్లు కుదరవు అంతే.. ప్రతిదానికి కారణం ఉంటుంది'' అని స్పష్టం చేశారు. గతేడాది 'అ!' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిత్యా ప్రస్తుతం 'ప్రాణా' అనే సినిమాలో నటిస్తోంది. దీన్ని తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. 

loader