యంగ్ హీరో నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు పెళ్లి గెటప్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు హీరో నితిన్. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుందని నితిన్ అన్నాడు. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ కథ మొదట విన్నప్పుడు తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని నితిన్ అన్నాడు.

మరిన్ని విషయాలు చెబుతూ.. ''నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉన్నారు. అయితే తరువాత చేసుకుంటానులే అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. సతీష్ వేగ్నేశ నా దగ్గరకి వచ్చి కథ చెప్పగానే నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే పెళ్లంటే ఇప్పుడు జరిగే పెళ్లిలా కాదు.. మా సినిమాలో జరిగే పెళ్లిలా చేసుకోవాలని అనుకున్నా.. షూటింగ్ ఆరంభంలోనే పెళ్లి సన్నివేశాలు షూట్ చేశారు.

ఆ పూజలు, వ్రతాలు చూసి బాబోయ్ పెళ్లంటే ఇలా ఉంటుందా అనుకున్నా.. అది విని మా అమ్మ కంగారు పడుతుందేమోనని టెన్షన్ పడకు మమ్మీ పెళ్లి కచ్చితంగా చేసుకుంటా అని చెప్పాను'' అంటూ ఈ సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో.. వెల్లడించాడు.